Ileana : గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం తెలుగు తెరపై దాదాపు కనిపించడం లేదు. అమ్మడికి క్రేజ్ తగ్గిందో లేదంటే మరో కారణమో తెలియదు కానీ ఆమె మాత్రం సినిమాలకు దూరమైంది. అయినప్పటికీ అమ్మడు మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటూ వస్తోంది. ఇల్లీ బేబీ ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ‘పోకిరీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మంచి స్టార్ డమ్‌ను సంపాదించుకుంది. అమ్మడు ఇప్పటికే ఓ లవ్ ట్రాక్‌ను నడిపిన ఇల్లీ బేబీ తాజాగా మరో లవ్ ట్రాక్‌ను నడుపుతోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
Ileana : మొదట విదేశీయుడు ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్..
ఇలియానా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఒకరితో డేటింగ్ చేసి.. చివరకు బ్రేకప్ కూడా చెప్పేసింది. మొదట విదేశీయుడు ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. అప్పట్లో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్. ఎక్కడ చూసిన అమ్మడి గురించే చర్చ. పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబుతున్నట్లు ప్రచారం జోరుగానే నడిచింది. అయితే ఇల్లీ బేబీ ఏమైందో ఏమో కానీ ఆండ్రూ నీబోన్‌తో బంధానికి సడెన్‌గా చెక్ పెట్టేయడం.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం చకచకా జరిగాయి. ఈ కారణంగానే అమ్మడు కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే తిరిగి మెల్లమెల్లగా యాక్టివ్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో ఇల్లీ బేబీ పీకల్లోతు ప్రేమలో ఉందని టాక్ బీభత్సంగా నడుస్తోంది. అమ్మడి ప్రేమ వ్యవహారం ఆంగ్ల వెబ్‌సైట్లు బాగా హైలైట్ చేస్తున్నాయి. కత్రీనా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.