Bigboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ షో సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానుందని టాక్. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ వస్తుందా? అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లోగో, టీజర్ వదిలి ప్రేక్షకులను అలర్ట్ చేసింది బిగ్‌బాస్ టీమ్. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల ఎంపిక సైతం పూర్తైనట్టు టాక్ నడుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి బిగ్‌బాస్ నిర్వాహకులు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. అనారోగ్యంతో ఎవరూ మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వెళ్లకుండా ముందుగానే హెల్త్ చెకప్.. అలాగే హౌస్‌లో ఉండలేక బయటకు వెళ్లే అవకాశం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండిస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అని కూడా ముందుగానే ఆలోచించి బిగ్‌బాస్ టీం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని సమాచారం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 1. ప్రత్యూష 2. గలాటా గీతూ 3. ఉదయభాను 4. ఆర్జే చైతూ 5. అనిల్ రాథోడ్ 6. దీపికా పిల్లి 7. అమర్ దీప్ చౌదరి 8. శ్రీమాన్ 9. నేహా చౌదరి 10. ఆర్జే సూర్య 11. ఆది రెడ్డి 12. నిఖిల్ విజేంద్ర 13. చలాకీ చంటి 14. శ్రీసత్య 15. ఇనయా సుల్తానా 16. పాండు మాస్టర్ వంటివారు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నట్టు టాక్ నడుస్తోంది.
Bigboss 6 : చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండిస్తే..
మరోవైపు బుల్లెట్ బండి సింగర్ మోహన భోగరాజ్ సైతం బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్జే సూర్య, నేహా చౌదరి, హీరోయిన్ ఇనయ సుల్తానా, అప్పారావు, తన్మయి పేర్లు ప్రచారంలో ఉన్నా వీళ్లు ఈ సీజన్‌లో అడుగు పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కంటెస్టెంట్ చివరి నిమిషంలో హ్యాండిస్తే మాత్రం వీరిలో ఎవరినైనా ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంది. ఇక ఈ సారి గ్లామర్ డోస్ బీభత్సంగా ఉండే అవకాశం ఉందని టాక్. ప్రముఖ యాంకర్స్ దీపికా పిల్లి, ఉదయభాను, ప్రత్యూష, నేహాలు బిగ్‌బాస్‌లో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మలంతా షోలో ఉంటే అటు గ్లామర్‌కి గ్లామర్.. మసాలాకి మసాలా ఓ రేంజ్‌లో ఉంటుందని టాక్.