సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే 2020 నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ సినిమా మెప్పించింది. ఇక సినిమాలో సూర్య అద్భుతమైన నటనకి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళీకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక సినిమా కథ, కథనాలు, మ్యూజిక్, అలాగే నటుల పెర్ఫార్మెన్ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ప్రస్తుతం ఈ సినిమా హిందీలో రీమేక్ కి కూడా రెడీ అవుతుంది తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు జాతీయ అవార్డుల వేడులలో ఊహించని విధంగా సత్తా చాటింది. ఉత్తమ చిత్రం కేటగిరీలో విభాగంలో అవార్డుని సొంతం చేసుకుంది. అలాగే ఉత్త నటుడు ఉత్తమ నటి ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ దర్శకుడు కేటగిరీలలో ఈ సినిమా అవార్డులని సొంతం చేసుకుంది. మెజారిటీ కేటగిరీలలో ఈ సినిమా అవార్డులని సొంతం చేసుకోవడం ద్వారా సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
ఇలా సౌత్ ఇండియా నుంచి ఇన్ని విభాగాలలో మొదటి సారి అవార్డులని సొంతం చేసుకున్న సినిమాగా ఆకాశం నీ హద్దురా సినిమా నిలవడం విశేషం. ఇదిలా ప్రాంతీయ చిత్రాల కేటగిరీలో తెలుగు ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో నిలవడం విశేషం. అలాగే ఉత్తమ సంగీత దర్శకత్వ విభాగంలో ఆల వైకుంఠపురంలో సినిమాకి గాను తమన్ కి దక్కింది. అలాగే ఉత్తమ్ కొరియోగ్రఫీ విభాగంలో ఊహించని విధంగా తెలుగు నుంచి నాట్యం మూవీ సొంతం చేసుకోవడం విశేషం. ఇలా సౌత్ సినిమాలు ఈ సారి జాతీయ అవార్డుల వేడుకలలో ఏక్కువ విభాగాలలో అవార్డులని సొంతం చేసుకోవడం విశేషం.