బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అమీర్ ఖాన్. రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా తనలోని నటుడిని బయటికి తీసుకొచ్చే విధంగా విలక్షణ పాత్రలతో, విభిన్నమైన కథలతో అమీర్ ఖాన్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక సినిమా కోసం అవసరం అయితే తన శరీరాన్ని ఎలా అయినా మార్చుకోవడానికి వెనుకాడని యాక్టర్ గా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో పాత్రలకి ప్రాణం పొసే నటుడుగా అందరూ అమీర్ ఖాన్ ని గుర్తిస్తారు. గౌరవిస్తారు. ఆయన 2016లో చివరిగా దంగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇది నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా దీనిని బ్రేక్ చేయలేదు. అయితే కొన్నేళ్ల క్రితం ఆయన భారత్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందుత్వ వాదులలో ఆయనపై వ్యతిరేకతని పెంచాయి.
ఇండియాలో ఉండటాలంటే భయంగా ఉందని చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు ఆ టైంలో ఎంత ప్రభావం చూపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రభావం పడింది. సోషల్ మీడియాలో హిందుత్వ వాదులు అమీర్ ఖాన్ భారత్ వ్యతిరేకి, అతని సినిమాలని బాయ్ కట్ చేయాలని పిలుపునిస్తూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మరి ప్రచారం చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ కి మద్దతుగా చాలా మంది లాల్ సింగ్ చద్దా సినిమాని బాయ్ కట్ చేయాలని ప్రచారాన్ని వైరల్ చేస్తున్నారు ఇక లాల్ సింగ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ దగ్గర పడింది. దీంతో సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో భయపడ్డాడు.
వెంటనే దీనిపై దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఓ ఈవెంట్ లో తనపై జరుగుతున్న ప్రచారంపై అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. నా సినిమాని బహిష్కరించి నన్ను బాధపెట్టొద్దు. ఈ ప్రచారం నన్ను ఎంతో బాధిస్తుంది. ఈ దేశాన్ని నేను ఇష్టపడనని కొంతమంది అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం కూడా నన్ను వేదనకి గురి చేస్తుంది. ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. దయచేసి నా సినిమాపై ఈ ప్రచారాన్ని ఆపండి అంటూ వేడుకున్నాడు. ఇక అమీర్ ఖాన్ వీడియో చూసిన అభిమానులు అతనికి అండగా నిలబడ్డారు. సినిమాని ఎట్టి పరిస్థితిలో హిట్ చేస్తామని ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అమీర్ ఖాన్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం సినిమాపై ఎ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి. ఇక తెలుగులో లాల్ సింగ్ చద్దా మూవీకి చిరంజీవి సమర్పకుడుగా వ్యవహరిస్తూ దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నారు.