వలిమై సినిమాపై కోలీవుడ్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో హీరోగా అజిత్ దుమ్ములేపుతుంటే.. విలన్‌గా కార్తికేయ చేసాడు. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక నిర్మాత బోనీ కపూర్ అవ్వడంతో హిందీలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. బైక్ చేజింగ్, రేస్, యాక్షన్ సీక్వెన్స్‌లు కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 24న రాబోతోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 22 న జరిగింది. ఈ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ.. ఓ తప్పు చేసాడు. మూవీ విడుదల తేదీని మరిచిపోయాడు. ఫిబ్రవరి 24న అని చెప్పాల్సి ఉండగా నవంబర్ 24న అంటూ నోరు జారేశాడు. ఆ తరువాత ఎప్పటికో తన తప్పు తెలుసుకుని.. సరి చేసుకున్నాడు సదరు హీరో గారు. ముందు మాట్లాడుతూ విడుదల తేదీని తప్పుగా చెప్పానట.. నవంబర్ 24 అని చెప్పానట. క్షమించండి అని చెప్పాడు.
వలిమై సినిమా ఫిబ్రవరి 24న రాబోతోందని సరి చేసుకున్నాడు కార్తికేయ. ఇందాక ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నాను.. నవంబర్ 24 అంటే అది నా పెళ్లి రిసెప్షన్ రోజు అంటూ కార్తికేయ చెప్పాడు. మొత్తానికి తన స్పీచులో ఇటు పవర్ స్టార్, అటు తలా అభిమానులను కవర్ చేసేసాడు. ఫిబ్రవరి 24న వలిమై సినిమా చూడండి.. ఆ తరువాత ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా చూడండని ఇద్దరి హీరోల అభిమానులను కోరాడు కార్తికేయ.
బాక్సాఫీస్‌కు పట్టిన తుప్పు వదిలించేందుకు ఇలా అజిత్, పవన్ కళ్యాణ్ ఒక్క తేదీ గ్యాప్‌తొ వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు కార్తికేయ. మొత్తానికి వలిమై సినిమాతో కార్తికేయ కోలీవుడ్‌లో తన సత్తా చాటబోతున్నాడు.