Kavya Thapar Drunk And Hit కేసు లో ఏక్ మినీ కథ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కావ్య తాపర్ర్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. ముంబైలో కావ్య తాపర్ చేసిన హల్చల్కు పోలీసులు షాక్ అయిపోయారు. మద్యం మత్తులో కారుని ఢీ కొట్టడమే కాకుండా.. పోలీసుల మీదకు బూతుల దాడి చేసింది. దీంతో ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
కావ్య తాపర్ తన కెరీర్ మోడలింగ్ ద్వారా ప్రారంభించింది. ఎన్నో ఉత్పత్తుల యాడ్స్ లో నటించింది. అటు నుంచి మెల్లిగా వెండితెరపైకి వచ్చింది. షార్ట్ ఫిల్మ్ తక్తల్తో నటిగా కెరీర్ను ప్రారంభించింది.. ఏక్ మినీ కథ సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్గా మారింది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సంతోష్ శోభన్కు, కావ్య తాపర్కు ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.
అలా వచ్చిన పేరును ఇప్పుడు కావ్య చేసిన పనితో పోయేలా కనిపిస్తుంది. మద్యం తాగి విచ్చలవిడిగా నడి రోడ్డు మీద హంగామా చేసినట్టు సమాచారం. తాగిన మైకంలో కారును ఢీ కొట్టి.. పోలీసుల మీదకే తిరగబడినట్టు సమాచారం. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి కావ్య తాపర్ మాత్రం సినిమా కెరీర్ కంటే ఈ వివాదంతోనే ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా కపిస్తుంది. వీకెండ్ పార్టీని ఎంజాయ్ చేసి వస్తున్నా సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.