Actors Sunil: కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సునీల్. కెరియర్ లో సుదీర్ఘకాలం పాటు కమెడియన్ గా కొనసాగిన సునీల్ తర్వాత హీరోగా టర్న్ తీసుకొని హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. అయితే ఆ సక్సెస్ ట్రాక్ ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ టర్న్ తీసుకున్న సునీల్ వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ వస్తున్నాడు. మరో వైపు విలన్ గా కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికే డిస్కో రాజా సినిమాతో విలన్ గా నటించి మెప్పించిన సునీల్ కి కలర్ ఫోటో సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరువాత పుష్పలో పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించాడు.
ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా యాక్టర్ గా మారిపోయిన సునీల్ ఇప్పుడు తన ఇమేజ్ ని మరింత ముందుకి తీసుకొని వెళ్తున్నారు. తమిళ్, మలయాళీ, హిందీ భాషలలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బిజీ యాక్టర్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ ‘జైలర్. కార్తి ‘జపాన్, శివకార్తికేయన్ సినిమాలోను . విశాల్ సినిమాలోను చేస్తున్నారు. అలాగే తెలుగులో కూడా శంకర్ – చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
అలాగే పుష్ప 2’లో నటిస్తున్నాడు. విరూపాక్షలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీటితో హిందీ సినిమాల కోసం సునీల్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుతం తన సినిమాల గురించి సునీల్ ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. మొత్తానికి కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ నటుడుగా తనదైన బ్రాండ్ ఇమేజ్ తో సునీల్ దూసుకుపోతూ ఉండటం విశేషం. ఇదిల ఉంటే