Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ నడుస్తుంది. సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ముందుగా ప్లాన్ చేసింది. అందులో భాగంగా టీజర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాపై నెగిటివ్ కామెంట్స్ విస్తృతంగా రావడంతో పాటు సినిమాలో ఉన్న కంటెంట్, పాత్రల చిత్రణపైన కూడా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తప్పనిసరి పరిస్థితిలో మరల సినిమా అవుట్ పుట్ పై మళ్ళీ వర్క్ చేయాల్సిన అవసరం వచ్చింది.
మరో వంద కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే పాత్రల చిత్రణలో కూడా చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్న సినిమా కావడంతో ప్రజల సెంటిమెంట్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో నిర్మాత భూషణ్ కుమార్ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మూవీ గ్రాఫిక్స్ వర్క్ పై మరోసారి వర్క్ చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీజర్ రిలీజ్ తర్వాత సినిమాని ఆరు నెలలు వాయిదా వేశారు.
జూన్ 16న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబందించిన మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ మూవీకి సంబందించిన 70 శాతం వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ నేపధ్యంలో మూవీ నుంచి మార్చి 30న శ్రీరామనవమి కానుకగా టీజర్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది. సినిమాపై వచ్చిన నెగిటివ్ బజ్ మొత్తాన్ని ఈ టీజర్ తో పోగొట్టడంతో పాటు సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేయాలని ఓం రౌత్ నిర్ణయించుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.