Aditi Rao Hydari : ట్రెడిషనల్ వేర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ. రాయల్ కుటుంబానికి చెందిన ఈ చిన్నది తెలుగు, హిందీ, తమిళం, మలయాళం చిత్ర పరిశ్రమల్లో నటిగా రాణిస్తూనే ఫ్యాషన్ రంగంలోనూ తనదైన మార్క్‌ను క్రియేట్ చేస్తోంది. దుస్తుల ద్వారా అదితి రావు హైదరీ తన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేస్తోంది. ఆమె స్థిరమైన ఫ్యాషన్‌ని నమ్మి, భారతీయ కళాకారులను ప్రోత్సహించే క్లాతింగ్ లేబుల్స్ కు అధిక మద్దతు ఇస్తుంది.అందుకు నిదర్శనంగా ఆమె వార్డ్ రోబ్ నిలుస్తుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అనేక ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌ను ధరించి అద్భుతమైన ఫోటో షూట్‌లను చేసి ఆ వస్త్రాలకే వన్నెను తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ కోసం అదితి ప్రముఖ క్లాతింగ్ లేబుల్ రా మ్యాంగో షెల్ఫ్‌ల నుండి పసుపు రంగు ఆర్గాన్జ్ సిల్క్ చీరను ఎన్నుకుంది. ఈ చీరను సంప్రదాయబద్ధంగా కట్టుకుని ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైలర్ అవుతున్నాయి. ఇన్‌స్టాలో ఫోటోలను పోస్ట్ చేసిన అదితి..అమ్మ ఫేవరేట్ కలర్ ఆన్ మీ అని క్యాప్షన్‌ను జోడించింది.

రా మ్యాంగో ఫ్యాషన్ లేబుల్ నుంచి వచ్చిన ఈ ఆర్గాంజ చీర ధర రూ. 54,800. ఆరి , జర్దోజీ వంటి క్లిష్టమైన ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో రూపొందించిన చీర ఇది. చిన్న పూల బుటిస్‌లతో అత్యద్భుతంగా చీరను తీర్చిదిద్దారు కళాకారులు. చూడగానే ఆకర్షించే రంగులో వచ్చిన ఈ చీరలో అదితి ఎంతో అందంగా కనిపించింది.

బంగారు రంగు అంచులతో వచ్చిన పసుపు చీరకు మ్యాచ్ అయ్యే లా కాంట్రాస్ట్ గా పచ్చని హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌తో జత చేసింది. ఈ ఎత్నిక్ వేర్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు
అదితి రావ్ హైదరి తన బంగారు ఝుంకాలు చెవులకు అలంకరించుకుంది. ఈ ఝుంకాలను కృష్ణదాస్ జ్యువెల్లరీ నుంచి ఎన్నుకుంది. నుదుటన ఆకుపచ్చ బిందీతో , సింపుల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది.

టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే కానీ తన నటనతో అందంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది నటి అదితిరావు హైదరి. రాజ కుటుంబానికి చెందిన ఈ చిన్నది తన ప్యాషన్‌తో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళం, తమిళం, హిందీ, మరాఠీ భాషలతో పాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో కనిపించింది. అదితి అస్సాంకు చెందిన మహ్మద్ సలేహ్ అక్బర్ హైదరి, హైదరాబాద్ కు చెందిన జానంపల్లి రామేశ్వరరావుల కుటుంబంలో జన్మించింది. వీరిద్దరిదీ రాజకుటుంబమే. 2006లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో దేవదాసీ పాత్రలో నటించింది. ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అదితి. ఈ సినిమాలో ఆమె అందాన్ని , నటను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.