Aditi Rao Hydari : అదితి రావ్ హైదరీ తన నిష్కళంకమైన సార్టోరియల్ ఎంపికలతో తన ఫాలోవర్స్ ను ఎల్లప్పుడూ ఆనందపరుస్తుంది. ఆమె రెడ్ కార్పెట్ ఈవెంట్‌కి హాజరైనా లేదా తన చిత్రాలను ప్రమోట్ చేసినా, ఎప్పుడూ ఉత్తమమైన రాయల్ లుక్ కలిగిన అవుట్ ఫిట్స్ నుఎంచుకుంటుంది.

ఈ బ్యూటీ తాజాగా టెలివిజన్ సిరీస్ ప్రమోషన్ల కోసం అదితి అందమైన వైట్ కలర్ ఎత్నిక్ వేర్ ను ఎన్నుకుంది. ఈ లుక్స్ లో అదితి తాజ్ మహల్ లా మెరిసిపోయింది.

జీ 5 లో త్వరలో రాబోతున్న అదితి హిస్టారికల్ డ్రామా – తాజ్ ,డివైడెడ్ బై బ్లడ్ ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నం అయ్యింది ఈ బ్యూటీ . తాజాగా చేసిన ప్రమోషన్ ఈవెంట్ కు తెలుపు మరియు నలుపు రంగుల కాంబినేషన్ లో వచ్చిన అనార్కలీ సెట్ ధరించి ప్రచారం చేసింది.

అదితి రావ్ స్టైలిస్ట్, సనమ్ రతాన్సీ, ఆమె అందమైన ఎత్నిక్ అవతార్ చిత్రాలను వైట్ హార్ట్ ఎమోజీతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆధునిక భారతీయ మహిళకు సరిపోయే అనార్కలీ సూట్లో అదితి అందంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఫంక్షన్లు, ఆదివారం బ్రంచ్‌లు లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌తో లంచ్ కు వెళ్లాలంటే ఈ అవుట్ ఫిట్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

ఫుల్ లెన్త్ స్లీవ్ లు , క్లిష్టమైన ఎంబ్రాయిడరీ ,స్కూప్ నెక్లైన్ కలిగిన అనార్కలి టాప్ కి మ్యాచింగ్ గా ఫ్లెర్డ్ ప్యాంట్ , షిఫాన్ దుపట్టా ధరించింది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా అదితి చెవులకు అందమైన జుమ్కీలు అలంకరించుకుంది. నుదుటన బొట్టు పెట్టుకుని , తన కురులను మధ్యభాగంలో విడదీసి లూస్ గా వదులుకుంది. కనులకు సున్నితమైన ఐ షాడో, మస్కరా , పెదాలకు లిప్ స్టిక్ పెట్టుకుని తన లుక్ ను మరింత అందంగా మార్చుకుంది.
