Aero India 2023 : ఐదు రోజుల పాటు జరిగే ఏరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, నవ భారత సామర్థ్యానికి బెంగళూరు ఆకాశం సాక్షి సాక్షిగా మారుతోందని మోదీ అన్నారు. కొత్త ఔన్నత్యమే నవ భారత సత్యమని అది బెంగళూరు ఆకాశం నిరూపిస్తోందని పేర్కొన్నారు. నేడు, దేశం కొత్త శిఖరాలను తాకడంతో పాటు దానిని దాటుతోంది” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
భారతదేశం విస్తరిస్తున్న సామర్థ్యాలకు ఏరో ఇండియా ఒక ఉదాహరణగా నిలుస్తుందని మోదీ తెలిపారు. ఇక్కడ దాదాపు 100 దేశాలులకు పైగా ఉండడం వల్ల భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందని చెప్పవచ్చన్నారు . ఈ ఏరో ఇండియా లో భారతదేశం తో పాటు ప్రపంచ నలుమూలల నుండి 700 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది అని మోదీ అన్నారు.
ఏరో ఇండియా భారతదేశం యొక్క కొత్త విధానాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్న ప్రధాని, ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని , దేశం యొక్క బలం కూడా అని అన్నారు . ఈ ప్రదర్శన భారత రక్షణ పరిశ్రమ పరిధి , ఆత్మవిశ్వాసంపై దృష్టి పెడుతుంది అని ఆయన అన్నారు.
ద్వైవార్షిక ప్రదర్శనలో మొత్తం 809 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు . వీరిలో 110 మంది విదేశీ ఎగ్జిబిటర్లు 699 మంది భారతీయ ప్రదర్శనకారులు ఉన్నారు. తేలికైన, అత్యంత చురుకైన , మల్టీ-రోల్ సూపర్సోనిక్ ఫైటర్ IAF తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏరో ఇండియా షోలో హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఐదు రోజుల వైమానిక ప్రదర్శన ఫిబ్రవరి 17న ముగుస్తుంది . ఫిబ్రవరి 16 మరియు 17 తేదీల్లో సాధారణ ప్రజలు వీక్షించే అవకాశం ఉంటుంది.