Air India : మహిళా పాసెంజర్‌పై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనను డీజీసీఏ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయంపైన ఎయిర్ ఇండియా ఇచ్చిన వివరణపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది అంతే కాదు నిబంధనల ప్రకారం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. అంతే కాదు పైలట్-ఇన్-కమాండ్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. నవంబర్ 26న న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా AI-102 విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపానలు వచ్చాయి. మీడియా హైలైట్ చేయడంతోనే ఈ సంఘటను తమకు తెలిసిందని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది.

నవంబరు 27న మహిళా ప్రయాణికుల నుంచి ఫిర్యాదు చేస్తే , ఎయిర్ ఇండియా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేసి జనవరి 4న డీజీసీఏకి నివేదించింది. ఎయిరిండియా అకౌంటబుల్ మేనేజర్, ఎయిర్ ఇండియా ఇన్-ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్, విమానంలోని పైలట్లు , క్యాబిన్ సిబ్బంది అందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, ఎందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య తీసుకోకుండా తమ బాధ్యతలను విస్మరించారని DGCA ప్రశ్నించింది. ఈ విషయమై గురువారం ఎయిరిండియా లిఖితపూర్వకంగా పంపిన సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని డీసీజీఏ అధికారులు తెలిపారు. మూత్ర విసర్జన కేసుకు సంబంధించి ఎయిర్ ఇండియా అంతర్గత నివేదికను సమర్పించింది.

DGCAకి ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానం ఆధారంగా, CAR ని ఉల్లంఘించినందుకు గాను ఏవియేషన్ రెగ్యులేటర్ కు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 141 వర్తించే DGCA CAR ప్రకారం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు పేర్కొన్న ఫ్లైట్ యొక్క పైలట్-ఇన్-కమాండ్ లైసెన్స్‌ను కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు DGCA పేర్కొంది. DGCA ఆర్డర్‌ను స్వీకరిస్తున్నామని ఎయిర్ ఇండియా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది, విమానయాన సంస్థ సిబ్బందికి మరింత అవగాహనను అందిస్తుందని ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటోందని పేర్కొంది.