Allu Aravind: ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్ ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలని తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా కాంతారా. ఈ మూవీ ఏకంగా 60 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఇచ్చిన ఊపుతో తరువాత మలయాళంలో హిట్ అయిన మాళికాపురం సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన హిట్ కాలేదు. అయితే ఒటీటీలో దీనికి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కి సూపర్ హిట్ అయిన విడుతలై 1 సినిమాని తెలుగులో విడుదల అనే టైటిల్ తో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఇందులో అల్లు అరవింద్ పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ మధ్య కాలంలో ఒక కొత్త సామెత వచ్చింది . లోకల్ ఈజ్ గ్లోబల్ అని. దానికి కరెక్టుగా సరిపోయే సినిమానే ఇది. ఈ సినిమా తమిళ వెర్షన్ ను చూస్తూ క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోయాను. ఈ సినిమా కోసం సూరి ఎంత కష్టపడ్డాడనేది నాకు అర్థమైంది” అన్నారు. వెట్రి మారన్ సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన నుంచి చాలా హిట్లు వచ్చాయి. అయినా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. గెడ్డం పెంచుకుని రోడ్డుపై వెళుతున్న ఆయనను చూస్తే వెట్రి మారన్ అంటే ఎవరూ నమ్మరు. అసలు ఆయనకి డబ్బుపై కోరిక ఉందా? లేదా? అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన నుంచి మరో మంచి సినిమా వచ్చింది. దీనిని జనంలోకి తీసుకువెళ్లమని నేను ప్రెస్ ను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.