పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కసారిగా ఇండియన్ వైట్ గా పాపులర్ అయిపోయాడు. ఏకంగా ఇండియన్ ఫేమస్ మ్యాగ్జన్లో కవర్ పేజీ పై కూడా దర్శనం ఇచ్చే స్థాయికి అల్లు అర్జున్ ఇమేజ్ పెరిగింది. ఒకప్పుడు మ్యాగజైన్ కవర్ పేజీ అంటే బాలీవుడ్ హీరోలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. అయితే పాన్ ఇండియా సినిమాలతో ముఖ్యంగా తెలుగు హీరోలు కూడా మ్యాగజైన్ కవర్ పేజీలపై దర్శనం ఇస్తున్నారు. వీరందరూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ ఇంకా ప్రత్యేకమైన చెప్పాలి. సినిమా సినిమాకి తనలో లుక్ పరంగా వేరియేషన్స్ చూపించడం బన్నీ స్టైల్.
ఇక పుష్ప సినిమా తర్వాత తన లుక్స్ తో ఇండియన్ వైడ్ గా అందర్నీ బన్నీ ఆకర్షిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరో లుక్ తో మెస్మరైజ్ చేస్తూ బన్నీ సోషల్ మీడియా ట్రెండ్ లోకి వచ్చేసాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోలను తలపించే విధంగా సరికొత్త మేకోవర్ తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ తాజా లుక్ లో కనిపించడం విశేషం. బాలీవుడ్ హీరోలను తలదన్నే విధంగా బన్నీ సరికొత్త లుక్ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ అవుతుంది.
నల్లని కళ్ళజోడు, నోట్లో సిగ పెట్టుకొని సీరియస్ మేనరిజమ్ తో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా ఈ లుక్ లో బన్నీ కనిపిస్తున్నడని అప్పుడే సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటివరకు ఇండియన్ వైడ్ గా స్టైలిష్ అంటే రణవీర్ సింగ్ గురించి చర్చించుకునేవారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అతని ఇమేజ్ ను బీట్ చేసే విధంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్ తో ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సోషల్ మీడియా ఫాలోవర్స్ నేషనల్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. అలాగే మూవీ డైరెక్టర్స్ కూడా తన స్టామినా ఏంటో అనేది పరిచయం చేస్తున్నాడు.