Allu Arjun : నిన్నమొన్నటి వరకూ దక్షిణాదిలో అభిమానగణాన్ని పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా మొత్తంలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు బన్నీ అంటే ఒక బ్రాండ్. ఏం చేసినా.. లుక్ ఏమైనా మార్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో ఐకాన్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ తెప్పించింది. తొలి సినిమాతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను సాధించడం.. ఉత్తరాదిన తొలి సినిమాతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను అకౌంట్‌లో వేసుకోవడం మన బన్నీకే చెల్లింది. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’ తెరకెక్కనుంది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా అభిమానులు పండుగలా ఫీల్ అవుతున్నారు.
Allu Arjun : సౌత్ చిత్రాల కెపాసిటీపై ప్రచురించిన ఆర్టికల్‌లో హైలైట్
ఇదిలా ఉండగా.. బన్నీ తాజాగా మరో అరుదైన ఘనతను సాధించాడు. ఇటీవల ఇండియా టుడే కవర్ పేజ్‌కెక్కి ‘ది సౌత్ స్వాగ్’ అనే శీర్షికలో అల్లు అర్జున్ సైతం భాగమయ్యాడు.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సౌత్ చిత్రాల కెపాసిటీపై ప్రచురించిన ఆర్టికల్‌లో తనే ప్రముఖంగా హైలైట్ అవడం అభిమానులను ఆనందాశ్చర్యాలతో ముంచెత్తుతోంది. తాజాగా అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఒక పిక్.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్‌లో బ్లాక్ టీ షర్ట్ ధరించి.. హ్యాండ్సమ్‌గా.. చాలా స్టైలిష్‌గా ఉన్న ఈ పిక్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
అయితే బన్నీ ఈ పిక్‌కు అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టైల్ లో నిన్ను కొట్టే వాడేలేడంటూ.. అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. హెయిర్ స్టైల్, మ్యాన్లీ అపీరెన్స్ బన్నీని కొత్తగా ప్రెజెంట్ చేశాయి. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రంలో నటించడానికి రెడీగా ఉండడంతో.. మొదటి భాగానికి సంబంధించిన మేకోవర్‌నే అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తున్నాడు. ‘పుష్ప’ మొదటి భాగంలో అతడి మాస్ అవతార్‌కు మంచి మార్కులే పడటంతో అదే లుక్‌ను రెండో భాగంలో కూడా కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బన్నీ ‘పుష్ 2’ను స్టార్ట్ చేయబోతున్నాడు కాబట్టి మరిన్ని పిక్స్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.