Allu Arjun : అల్లు అర్జున్.. తొలుత స్టైలిష్ స్టార్.. ఈ మధ్య ఐకాన్ స్టార్‌గా కూడా మారిపోయాడు. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దీంతో ఎన్నో అడ్వర్టైజింగ్ కంపెనీలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. నిజానికి ఆయన పేరే ఒక బ్రాండ్. దీంతో బన్నీ యాడ్ చేశాడంటే ఆ యాడ్‌లోని వస్తువుకు మంచి మార్కెట్ అవుతుంది. ఇటీవల పలు యాడ్స్‌లో సైతం మనోడు కనిపిస్తున్నాడు. ఈ వాణిజ్య ప్రకటనల కోసం తన లుక్ కూడా మార్చుకుంటున్నాడు. సాధారణంగా అల్లు అర్జున్ ఒక్కో యాడ్‌కు రూ.7.5 కోట్లు తీసుకుంటాడని సమాచారం.
కానీ ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కోసం పెద్ద మొత్తంలో ఓ కంపెనీ ఆఫర్ చేసినట్టు సమాచారం. అయినా కూడా మనోడు నో చెప్పేశాడట. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే అదొక గుట్కా అండ్ లిక్కర్ కంపెనీ కావడమే! తాజాగా ఓ గుట్కా అండ్ లిక్కర్ కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలంటూ అల్లు అర్జున్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్ చేశారట. అయినప్పటికీ మన ఐకాన్ స్టార్ యాడ్ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడట. జనాలకు హాని చేసే అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశం లేదని బన్నీ చెప్పేశాడట.
Allu Arjun : అవతల జరిగే నష్టం ఎన్ని కోట్లు పెట్టినా పూడ్చలేకపోవచ్చు..
మరొక కోణం ఏంటంటే.. ఇలాంటి యాడ్స్‌లో నటిస్తే బన్నీకి ఉన్న రెప్యుటేషన్ దెబ్బ తినే అవకాశమూ లేకపోలేదు. రూ.10 కోట్ల కోసం ఈ యాడ్ చేస్తే కావల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇన్నాళ్ల నుంచి తనకున్న పేరు మొత్తం ఒకే ఒక్క యాడ్‌తో పోగొట్టుకోవల్సి వస్తుంది. రూ.10 కోట్ల కోసం చూసుకుంటే.. అవతల జరిగే నష్టం ఎన్ని కోట్లు పెట్టినా పూడ్చేలా ఉండకపోవచ్చు. అన్నీ ఆలోచించి బన్నీ ఈ యాడ్‌కు నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం బయటకు రావడంతో అతడు తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను బన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడంటూ కామెంట్లు చేస్తున్నారు.