ఐకానిక్ స్టార్ గా సౌత్ లో ప్రస్తుతం తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతున్న నటుడు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ గా తనకి ఉన్న ఇమేజ్ కి సార్ధకం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్ తో మోస్ట్ స్టైలిష్ యాక్టర్ గా ఇండియన్ వైడ్ గా తన ఇమేజ్ ని విస్తరించుకున్నాడు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. ప్రస్తుతం సౌత్ లో యాడ్ కంపెనీలు తన ఉత్పత్తులని ప్రమోట్ చేసుకోవడం కోసం అల్లు అర్జున్ ని సంప్రదిస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటున్నాయి. ఇప్పటీకే ఒక సాఫ్ట్ డ్రింక్ ప్రొడక్ట్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా చేయడంతో పాటు, ర్యాపిడో ప్రీపెయిడ్ బైక్ సర్వీస్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు.
దీంతో పాటు మరికొన్ని ప్రొడక్ట్స్ కి ప్రచారకర్తగా బన్నీ ఉన్నారు. ఇలా యాండర్స్ మెంట్ ల ద్వారానే అల్లు అర్జున్ కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ 10 కోట్ల రూపాయిల యాడ్ ఆఫర్ ని తిరస్కరించాడు. అయితే అది నిషేధిత గుట్కా, లిక్కర్ బ్రాండ్స్ ప్రమోషన్ కోసం సదరు కంపెనీ ఏకంగా 10 కోట్లని అల్లు అర్జున్ కి ఆఫర్ చేసియింది. అయితే వాటిని ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ గుట్కా ప్రొడక్ట్స్ కి ప్రచాకర్తలుగా చేశారు.
నిజానికి ప్రస్తుతం బన్నీ ఒక్కో యాడ్ ప్రమోషన్ కోసం 7.5కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే సదరు గుట్కా , లిక్కర్ బ్రాండ్ కంపెనీలు 10 కోట్లు ఆఫర్ చేసిన ప్రజలని తప్పుదోవ పట్టించినట్లు అవుతుందని వదిలేయడం విశేషం. ఈ విషయాన్ని సినీ క్రిటిక్ మనోబాల తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు. ఇక బన్నీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో వైరల్ చేస్తూ తమ హీరో గొప్పతనం గురించి ప్రచారం చేస్తున్నారు.