టాలీవుడ్ లో మ్యాచో స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని నితిన్ సొంతం చేసుకున్నాడు.. కెరియర్ ఆరంభంలో కొంత మూస ధోరణిలో సినిమాలు చేస్తూ డిజాస్టర్స్ కొట్టిన నితిన్ ఇప్పుడు మళ్ళీ గాడిలో పడ్డాడు. అయితే ఇప్పటికి కూడా ఏకధాటిగా సక్సెస్ లని నితిన్ అందుకోలేకపోతున్నాడు. ఒక హిట్ వస్తే మళ్ళీ వెంటనే ఫ్లాప్ సినిమా చేస్తూ కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. భీష్మ సినిమాతో చివరిగా హిట్ కొట్టిన నితిన్ తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన చెక్ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన రంగ్ దే, మ్యాస్ట్రో సినిమాలు కూడా నితిన్ కి బ్యాడ్ టాక్ నే ఇచ్చాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకొని కొత్త దర్శకుడుతో మాచర్ల నియోజకవర్గం సినిమా చేసాడు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇందులో నితిన్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.
ఇదిలా ఉంటే డాన్స్ మాస్టర్ కెరియర్ ప్రారంభించి తరువాత దర్శకుడుగా మారి, నటుడు అవతారం ఎత్తిన అమ్మ రాజశేఖర్ తాజా నితిన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. కెరియర్ ఆరంభంలో నితిన్ కి అస్సలు డాన్స్ రాదని, అతనికి నేనే దగ్గరుండి నేర్పించానని అమ్మ రాజశేఖర్ పేర్కొన్నారు. అతనికి గురువు స్థానంలో ఉన్న నేను నా సినిమా వేడుక కోసం పది రోజుల ఆహ్వానించాను. అప్పుడు వస్తానని మాటిచ్చారు. అతను వస్తాడని స్పెషల్ గా ఒక వీడియో కూడా తయారు చేశా. అయితే చివరి నిమిషంలో రాకుండా హ్యాండ్ ఇచ్చారు. అతనికి షూటింగ్ కూడా ప్రస్తుతం లేదు. జ్వరంగా ఉందని కారణం చూపించి రాకుండా తప్పించుకున్నాడు. కనీసం గురువు అనే గౌరవం కూడా అతనికి లేదు. నటులకి టెక్నిషియన్స్ అంటే ఫ్రూట్స్ లా కనిపిస్తారని విమర్శలు చేసారు. అయితే ఫ్రూట్స్ నుంచి పారేసిన విత్తనాలు మళ్ళీ మొలకెత్తుతాయని, త్వరలో మళ్ళీ కలుద్దాం అంటూ నితిన్ పై అమ్మ రాజశేఖర్ పంచ్ లు వేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చ్చర్చనీయాంశంగా మారాయి. వీటిపై హీరో నితిన్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది వేచి చూడాలి.