Ananya Panday: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. ిక విజయ్ దేవరకొండతో పాటు లైగర్ హీరోయిన్ అనన్య పాండే చేసే రచ్చతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ ఇద్దరూ కలిసి పబ్లిక్ గా మాట్లాడుతున్న మాటలు లైగర్ సినిమా పేరును జనం నోళ్ళలో నానేలా చేస్తున్నాయి. కొన్ని మాటలు మాత్రం శృతి మించుతున్నాయని.. మరీ సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారాలా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేసేలా కూడా ఉన్నాయి. ఏది ఏమైతేనేమి వీరి మాటలతో లైగర్ సినిమాపై హీట్‌ను అయితే పెంచగలుగుతున్నారు.
Vijay Deverakonda Ananya Panday: పర్సనల్ విషయాలను టచ్ చేసిన కరణ్
విజయ్ దేవరకొండను ఉద్దేశించి బాలీవుడ్ ముద్దుగుమ్మ.. లైగర్ హీరోయిన్ అనన్య ఓపెన్ కామెంట్ చేసింది. అది విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కాఫీ విత్ కరణ్ షోకు ఈ లైగర్ జోడీ హాజరై రచ్చ చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండతో పాటు అనన్య పాండే ఈ షోలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమోలు విడుదల చేసి జనాల్లో ఆసక్తి పెంచేశాయి. తాజాగా షో టెలికాస్ట్ అయ్యింది. ఇందులో అనన్య చెప్పిన ఒక మాట మాత్రం పెను సంచలనానికే దారి తీసింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఎన్నో పర్సనల్ విషయాలు అంటే.. ప్రేమ, శృంగారం లాంటి ఎన్నో మ్యాటర్స్ను కరణ్ జోహార్ టచ్ చేశారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండను నగ్నంగా చూడాలని ఉందనే కోరిక బయటపెట్టింది అనన్య. ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా అనన్యపై ఓ ప్రశ్న వేశారు కరణ్. విజయ్ దేవరకొండని నగ్నంగా చూడాలనుకుంటున్నావా? అని అడగడంతో ఆమె ఓపెన్ గా రియాక్ట్ అయింది. ‘అవును లైగర్ సినిమాలో చూశాను. కాకపోతే మొత్తం కాదు.. అయినా ఎవరు మాత్రం అలా కోరుకోరు చెప్పండి? నాకు కూడా చూడాలనే ఉంటుంది’ అంటూ అనన్య పాండే పచ్చిగా సమాధానమిచ్చింది. మొత్తానికి అమ్మడి సమాధానంతో అవాక్కవడం నెటిజన్ల వంతు అయ్యింది.