Ananya Pandey : అనన్య పాండే బాలీవుడ్ పరిశ్రమ నుండి వచ్చిన ప్రధాన ఆకర్షణలలో ఒకరు . చేసింది కొన్ని ప్రాజెక్ట్స్ అయినా కూడా అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ను ఇండస్ట్రీ లో క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియా లోనూ అనన్య కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ అభిమానులు ఎల్లప్పుడూ ఈ నటీ అప్ కమింగ్ చిత్రాలు , పోస్ట్‌ల కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. తాజాగా సోషల్ మీడియా లో అనన్య లేటెస్ట్ ఫోటోలు ,వీడియోల ట్రేండింగ్ లో ఉన్నాయి. ఓ ఈవెంట్ కోసం బ్లూ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది అనన్య.
Ananya Pandey : అనన్య పాండే షోస్టాపర్‌గా మారిన ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి ముంబైకి వెళ్ళింది. అనన్య మెటాలిక్ బ్లూ దుస్తుల్లో ర్యాంప్ పైన వాక్ చేసింది. తన గ్లామరస్ లుక్స్ తో క్లోసప్ లో హాట్ ఫోటో లు దిగి , ఆ పిక్స్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె బోల్డ్ పిక్‌లు సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనన్య తన హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ క్యాప్షన్‌లో రాసింది.
డిజైన్ వివరాలను గమనిస్తే ప్లంగింగ్ నెక్లైన్ , కర్వ్డ్ హెమ్ , మిడ్రిఫ్-బేరింగ్ లెన్త్ కలిగిన మెటాలిక్ బ్లూ-కలర్ స్ట్రాప్‌లెస్ బ్రాలెట్ లో అనన్య మెరిసిపోయింది. ఆమె దానికి మ్యాచింగ్ మెటాలిక్ బ్లూ లాంగ్ స్కర్ట్‌తో జత చేసింది.
హై రైజ్ వేయిస్ట్ లైన్, థై హై స్లిట్ తో వచ్చిన లాంగ్ సీ-త్రూ స్కర్ట్‌లో షార్ట్ వేసుకుంది. పొడవాటి తెరలతో అలంకరించబడిన నిర్మాణాత్మక కట్-అవుట్ లీఫ్ నమూనాలు ఈ సి త్రూ స్కర్ట్ కు అందించారు డిజైనర్. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మెటాలిక్ ఇయర్ రింగ్స్ పాయింటెడ్ రాయల్ బ్లూ హైహీల్స్ ను వేసుకుని కుర్రాళ్ళను కవ్వించింది.
అనన్య చివరగా మెరిసేటి వెండి రంగుతో కూడిన స్మోకీ ఐ షాడో, కనురెప్పల మీద బరువైన మస్కరా వేసుకుని కనుబొమ్మలను డార్క్ చేసుకుంది. పెదాలకు న్యూడ్ పింక్ లిప్ స్టిక్ దిద్దుకుని అదరగొట్టింది.