జబర్దస్త్ కామెడీ రియాలిటీ షోతో యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ షోతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని హాట్ యాంకర్ గా టీవీ రియాలిటీ షోలతో మంచి ఆఫర్స్ సొంతం చేసుకుంది. ఇక అదే సమయంలో నటిగా కూడా ఎంట్రీ ఇచ్చి క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. వాటి తర్వాత అనసూయకి బాగానే అవకాశాలు వచ్చాయి. ఆమెని లీడ్ రోల్ చేసుకొని కూడా సినిమాలు తెరకెక్కించారు. అలాగే పెద్ద హీరోల సినిమాలలో ఐటెం సాంగ్స్ కూడా బాగానే చేసింది. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు జబర్దస్త్ చేస్తూ, మరో వైపు స్టార్ మా, జీ తెలుగులో రకరకాల షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. దీంతో కొద్ది రోజుల క్రితం తనకి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోని పూర్తిగా వదిలేసింది.
ఇక జబర్దస్త్ షోని ఈమె వదిలేయడానికి కారణాలు అంటూ రకరకాల కథనాలు వినిపించాయి. అయితే తాజాగా అనసూయ నేరుగా అసలు విషయాన్ని చెప్పింది. సినిమాలపై ఎక్కువ ద్రుష్టి పెట్టడం వలన జబర్దస్త్ కోసం డేట్స్ కేటాయించడం కష్టం అవుతుందని, నా కారణంగా వాళ్ళు షూటింగ్ పోస్ట్ ఫోన్ చేయడం ఇష్టం లేకనే వదిలేసినట్లు చెప్పింది. జబర్దస్త్ ని నాగబాబు, రోజా వదిలేశారు కాబట్టి నేను కూడా వారి దారిలో వదిలేసానని అందరూ అంటున్నారు. అయితే నేను గొర్రెని కాదు. నాకంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొంది. అలాగే జబర్దస్త్ లో బాడీ షేమింగ్ జోక్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారని, అలాంటివి విన్నప్పుడు కాస్తా అసహనం కలుగుతుందని అనసూయ చెప్పుకొచ్చింది.
అయితే యాంకర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తప్పక భరించాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. దీనిని బట్టి జబర్ధస్త్ మీద అనసూయకి సరైన అభిప్రాయం లేదని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మొత్తానికి అనసూయ జబర్దస్త్ ని విడిచి పెట్టడానికి కారణం ఇతర సినిమాలు, ప్రోగ్రామ్స్ ఎక్కువ కావడమనే దానికి ఒక స్పష్టత వచ్చింది. అలాగే జబర్దస్త్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.