పది రోజుల క్రితం వాలెంటన్స్ డే రోజు శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక విషయం ఆమె అభిమానుల దృష్టినే కాకుండా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మీడియా వర్గాల వారిని మరియు సినీ వర్గాల వారిని కన్ఫ్యూజన్ లోకి నెట్టి వేసింది. ఏంటీ అంటే.. వాలెంటైన్స్ డే రోజున శ్రీముఖి ఈ రోజును గుర్తు పెట్టుకోండి.. ఈ రోజు జీవితంలోనే చాలా స్పెషల్ డే అంటూ చెప్పుకొచ్చంది. ఆ పోస్ట్ తో శ్రీముఖి ప్రేమలో ఉన్నట్లుగా అందరికి క్లారిటీ వచ్చేసింది.
అయితే శ్రీముఖి ప్రేమలో ఉన్నది క్లారిటీ వచ్చేసింది కాని అది ఎవరితో అంటూ గత పది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. బుల్లి తెరకు చెందిన వ్యక్తి అంటూ కొందరు అంటు ఉంటె మరి కొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉండే వ్యక్తి అంటూ ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి శ్రీముఖి ప్రియుడు ఎవరు అనే దానిపై గెస్సింగ్స్ జనాలు చాలా రకాలుగా చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా కూడా ఆమె మనసులో ఉన్నది ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు.
త్వరలో ఏంటో చెప్తాను అంటూ ప్రకటించిన శ్రీముఖి తాజాగా మరో స్పెషల్ డే అంటూ 25 ఫిబ్రవరి 2022 తేదీని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈ తారీకున మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటించింది. అదే రోజు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ను భోళా శంకర్ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తో కలిసి చూసిందట. అందుకే ఆ డేట్ చాలా స్పెషల్ అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో శ్రీముఖి నటిస్తున్నట్లుగా అయితే క్లారిటీ వచ్చింది. కాని అది ఏం పాత్ర.. ఎలాంటి పాత్ర అనేది అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది. చిరంజీవి సినిమాలో పాత్ర ఎంత చిన్నది అయినా కూడా అది దక్కడమే అదృష్టం అంటూ ఇండస్ట్రీ వారు అంటున్నారు. శ్రీముఖికి ఆ అవకాశం రావడంతో ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ మూమెంట్ అంటూ మెగా అభిమానులు అంటున్నారు.
ఇక శ్రీముఖి గత కొన్నాళ్లుగా బుల్లి తెర మరియు వెండి తెరపై సమానంగా ప్రయాణం కొనసాగిస్తుంది. బుల్లి తెరపై ఆమె యాంకర్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నా కూడా ఫాన్స్ ఆమె ను ఇంకా ఆధరిస్తూనే ఉన్నారు. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు యాంకర్ అనగానే సుమ తర్వాత ఎక్కువగా మంది చెప్పే పేరు శ్రీముఖి అనడంలో సందేహం లేదు. అంతటి గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖి నటిగా భోళా శంకర్ తర్వాత ఎంతవరకు బిజీ అయ్యేనో చూడాలి