బాలయ్య బాబు ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలు మాంచి ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇక అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అయితే బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో ఉన్న సమాచారం.
తాను బాలకృష్ణతో చేయబోయే సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు బాలకృష్ణ గారితో తాను చేయబోయే సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం కావడం ఖాయమని అనిల్ రావిపూడి చెపుతున్నాడు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్న అనిల్ రావిపూడి.. ఈ సినిమా పూర్తికాగానే బాలకృష్ణ మూవీని లైన్‌లో పెట్టబోతున్నారు.
అనిల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఆజ్ఞతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్ వాటి సినిమాలకు తన బాణీలను అందించి… సూపర్ హిట్ మ్యూజిక్ ని అందిచారు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్….
మరోవైపు బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాలో ఆయనను చాలా పవర్‌ఫుల్ రోల్స్‌లో చూపించబోతున్నారని సమాచారం. ఇందులో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ‘రౌడీయిజం’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా కంప్లీట్ కాగానే అనిల్ రావిపూడితో ఉంటుందని బాలకృష్ణ ఇదివరకే కన్ఫర్మ్ చేశారు. సో.. ఆ లెక్కన చూస్తే రాబోయే రోజుల్లో బాలయ్య మాస్ జాతరకు థియేటర్స్ హోరెత్తడం పక్కా అని తెలుస్తోంది..!.