Intinti Grugalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 16వ తేదీ ఎపిసోడ్ లో హైలెట్స్ ఏంటో చూద్దాం..
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అంకిత, శృతి వద్దకు వెళ్లిన ప్రేమ్ ఇంకా రాలేదని ఆలోచిస్తూ చాలా కాలం తర్వాత కలిశారు కదా ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి ఉంటారని అనుకుంటూ ఉండగా ఇంతలో ప్రేమ వస్తాడు. శృతి ఎక్కడ అని ప్రేమని ప్రశ్నించగా దానికి బదులుగా ఇక ఈరోజుతో శృతికి నాకు బంధం తెగిపోయింది. నువ్వు చెప్పావని నా ఆత్మ గౌరవం పక్కనపెట్టి మరి వెళ్లి బ్రతిమాలాను నేను లేకుండా శృతి సంతోషంగానే ఉంది ఇక మేము కలవడం జరగని పని అంటే దానికి అంకిత ఏం మాట్లాడుతున్నావ్ ప్రేమ్ ఏదో కోపంలో అలా అన్ని ఉండవచ్చు భార్యను దూరం చేసుకోవద్దు. ఆంటీ అంకుల్ ను దూరం చేసుకుని చాలా బాధపడుతున్నారు నువ్వు చూస్తున్నావు కదా అంటే దానికి ప్రేమ ఒకవేళ శృతిని ఇక్కడికి తీసుకువచ్చిన నేను తనతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంకిత ఏంటి ఇలా జరిగింది మంచి చేద్దాం అనుకుంటే ఇలా అయింది అని బాధపడుతుంది.
తర్వాత సన్నివేశంలో మీటింగ్ క్యాన్సిల్ అయింది కదా. పాపం తులసి గారికి బోర్ కొడుతుందేమో అని సామ్రాట్ తులసిని బయటికి తీసుకెళ్తానని చెప్తే అందుకు తులసి సరే అంటుంది. తరువాత ఆటోలో వెళుతుండగా ఏంటి ఆటోలోనా అని అడగక మీరు నాకు ఆటోలో లిఫ్ట్ ఇచ్చారు కదా మీరు రుణం తీర్చుకుంటున్న అంటాడు ఎక్కడికి తీసుకు వెళ్తున్నారని అడిగితే దానికి సామ్రాట్ సర్ప్రైజ్ అంటాడు. ఎదుటివారిని టెన్షన్ పెట్టే సర్ప్రైజ్ అవసరమా అని తులసి అంటుంది. దానికి సామ్రాట్ సరే ఇకనుంచి టెన్షన్ పడేంత సర్ప్రైజ్ లు మాత్రం చేయను కానీ ప్రస్తుతానికి ఇది సర్ప్రైజ్ అంటాడు. తర్వాత కళ్ళు మూసుకొని చెప్పి బీచ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. దగ్గరగా బీచ్లు చూస్తూ తులసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
సంతోషంతో తులసి తన మామయ్యకు ఫోన్ చేసి ఇప్పుడు నేను సముద్రం ముందర ఉన్నాను నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంటే దానికి బదులుగా కొత్తగా రెక్కలొచ్చిన పక్షి కి ఆశ చిన్నది అయినా అది తీర్చుకోవడం చాలా గొప్పది అమ్మ అంటే దానికి అవును మామయ్య నా వయసు మర్చిపోయి ఒక్కసారి చిన్న పిల్లల అయిపోయాను. నందును పెళ్లి చేసుకున్న నీ జీవితం 25 సంవత్సరాలు పాము కప్పను మింగినట్టు అయిందమ్మ. సంతోషం అనేది మిగలకుండా చేసింది. గతం గుర్తొచ్చి బాధ పెడుతుందా అంటే నేనిక్కడికి వచ్చింది గతం గురించి కాదు మామయ్య సంతోషపడ్డానికే వచ్చాను ఆ సంతోషం మీతో పంచుకోవడానికి ఫోన్ చేశాను. అప్పుడు ఆ సంతోషాన్ని అక్కడే వదిలిపెట్టకుండా ఇంటికి కూడా తీసుకురా తల్లి హ్యాపీగా ఎంజాయ్ చెయ్ ఉంటానమ్మ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా చూస్తున్న సామ్రాట్ ఎంతో ముచ్చటగా నవ్వుకుంటాడు. సామ్రాట్ తో సముద్రాన్ని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను ఇష్టం కంటే ఇంకా ఇష్టం సముద్రం నాకు అంటుంది. ఈ ఆనందం చూడడానికే మీకు సర్ప్రైజ్ అన్నాను ముందే చెప్పేస్తే నీ ముఖంలో ఆనందం కనిపించదు. నాకు సముద్రం చూడడం కన్నా సముద్రమంతా ఆనందం మీ ముఖంలో చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయం మీది ఈ ఆనందం కూడా కేవలం మీదే అవ్వాలి.
ఉదయం ఫ్లైట్లో ఎగిరారు ఇప్పుడు సముద్రంలో కూడా ఎగరండి అంటే దానికి తులసి నిజం చెప్పండి మీకు నీళ్లు అంటే కూడా భయమా అంటే సామ్రాట్ ఏడిపించడానికి అడుగుతున్నారా అంటాడు. దేవుడి దగ్గరికి వెళ్లి లోపలికి వెళ్లకుండా రావడం ఎంత తప్పు సముద్రం దగ్గరికి వచ్చి సముద్రం లోపలికి రాకపోవడం కూడా అంతే తప్పు అంటుంది తులసి. నా బదులు కూడా మీరే దండం పెట్టుకోండి అంటాడు సామ్రాట్. తరువాత తులసి బ్యాగ్ తీసుకొని హాయిగా ఎంజాయ్ చేయండి అంటాడు. తులసి సముద్రం ఒడ్డున అలలలో చిన్నపిల్లల ఆడుకుంటుంటే సామ్రాట్ నవ్వుకుంటూ చిన్నప్పటి కళ ఇన్నాళ్లకు తీరుతుంటే తులసి చిన్నపిల్లల మారిపోయింది అనుకుంటూ ఇన్నాళ్లుగా దాచుకున్న ఎన్నో ఆశలు సముద్రపు అలలు లాగా ఎగసిపడుతుంటే, తీరని కల నెరవేరుతుంటే ఇంత సంతోషంగా ఉంటుందా ఈ అనుభూతి ఎలా ఉంటుందో నా జీవితంలో తెలుసుకునే అవకాశం లేదు. పోగొట్టుకున్న సంతోషం గురించి బాధపడుతూ కూర్చోకుండా ఇలా కొత్త సంతోషాన్ని వెతుక్కోవడం దేవుడిచ్చిన వరం.
Intinti Grugalakshmi:
తర్వాత సన్నివేశంలో నందు, లాస్యతో మన బతుకులు బాడీగార్డ్ లాగా వాళ్ళ వెనకాల తిరగడానికే సరిపోతుంది ఇలా వెనకాలే వెళ్లడం చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అంటే దానికి లాస్య మొహమాటం ఎందుకు పదా వెతుకుదాం అంటూ వస్తూ ఉంటారు. మరొకవైపు తులసి ఇసుకలో ఆడుకుంటుంది. సామ్రాట్ కు గతంలో తులసి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి అన్ని సంతోషాలు మావే అని అనుకుంటే అది తప్పు కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇస్తే అది సంతోషం గా ఉండదు సామ్రాట్ గారు అన్న విషయం గుర్తుకొచ్చి ఇప్పుడు నాకు తెలుస్తుంది కోట్ల ఆస్తి ఉన్న జీవితానికి కొత్త అడుగులు కొత్త అర్థం నేర్చుకుంటున్నాను అనుకుంటాడు. తరువాత ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ సామ్రాట్ పక్కకు వెళితే అందరూ పరిగెత్తడం చూసి సామ్రాట్ ఏమైందని అడగక అందుకు ఎవరో ఒక ఆవిడ నీళ్లలో కొట్టుకుపోయిందని పరిగెత్తుతుంటే దానికి సామ్రాట్ తులసి కనిపించక తులసి ఏమో అని చాలా ఎమోషనల్ టెన్షన్ పడుతూ తులసి తులసి అని అరుస్తూ ఉండగా ఇంతటితో ఎపిసోడ్ అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.