Sravana Bhargavi : మతం ఏదైనా కానివ్వండి.. దానిలో ప్రముఖులను అవమానిస్తున్నారన్న ఆలోచన వస్తే చాలు ఆగ్రహం ఆకాశాన్నంటుతుంది. హిందువులు అన్నమాచార్యను చాలా భక్తితో గౌరవిస్తారు. అన్నమాచార్య కీర్తనలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అలాంటి అన్నమాచార్యుల వారి కీర్తలను అవహేళనగా పాడితే.. స్వాతికిరణం సినిమాలో మమ్ముట్టికి వచ్చినంత ఆగ్రహం వచ్చేస్తుంది. సహజమే కదా.. ఇది మనోభావాలకు సంబంధించిన విషయం. దీనిని ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందే. లేదంటే ఆగ్రహావేశాలకు గురవక తప్పదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? ప్రముఖ శ్రావణ భార్గవి చేసిన పని ఇలాంటిదే.
Sravana Bhargavi : ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ పాటను ఒక ఫ్యూజన్‌గా..
ఆమె అందమైన గొంతుకను ఇష్టపడనివారెవరకూ ఉండరు. మరి అంతటి శ్రావ్యమైన గొంతుకతో అన్నమాచార్యులవారి పాటను ఒక ఫ్యూజన్‌గా చిత్రీకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అన్నమయ్యను అవమానిస్తారా? అంటూ ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తాజాగా శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనతో ఓ ఆల్బమ్ చేసి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. అన్నమాచార్యులు రచించిన ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ పాటను ఒక ఫ్యూజన్‌గా చిత్రీకరించారమె. ఈ విషయం అన్నమయ్య కుటుంబీకుల దృష్టికి వెళ్లడంతో వారంతా మండిపడ్డారు.‘అన్నమాచార్యుల పాటను వెలికిగా చిత్రీకరించి ఆయన్ను అవమానించారంటూ ఫైర్ అయ్యారు. అభిషేకం వేళ వెంకటేశ్వరస్వామిని స్మరిస్తూ, భక్తి పారవశ్యంలో మునిగి తేలిన అనుభూతి కలిగేలా అన్నమయ్య ఆ పాటను రాశారు. అలాంటి పాటను ఆమె కాల్లు ఊపుతూ.. వివిధ భంగిమల్లో కనిపిస్తూ చిత్రీకరించడం అన్నమయ్య కుటుంబీకులకు అసహనం తెప్పించింది.
ఈ విషయం గురించి అన్నమయ్య కుటుంబీకులు శ్రావణ భార్గవితో ఫోన్లో మాట్లాడగా.. మీ కళ్లల్లోనే ఏదో తేడా ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిందని వారు వాపోయారు. సినీ పరిశ్రమకు చెందిన ఎవరైనా అన్నమాచార్యుల కీర్తను తీసుకుంటే ‘తిరు వేంకటా చలపతి’ అనే ముద్రతోనే ఏ కీర్తనను అయినా ఎండ్ చేస్తారు. కానీ.. శ్రావణ భార్గవి అలా చేయలేదు. ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అన్న శృంగార కీర్తనను మేం ఎందుకు చేయకూడదని ఎదురు ప్రశ్నించిందని తెలిపారు. శోభారాజ్ నుంచి ఎంతోమంది ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించమని కోరారని.. దీంతో ఆమె కామెంట్ సెక్షన్‌ను ఆమె హైడ్ చేసిందని తాళ్లపాక వెంకటరాఘవ అన్నమాచార్యులు తెలిపారు. మొత్తానికి శ్రావణ భార్గవి ఈ కీర్తనను ఆలపించి కావల్సినన్ని ట్రోల్స్‌ను మూటగట్టుకుంటోంది.