AP Budget: ఈ ఏడాది ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మెజారిటీగా నిధులు సంక్షేమం కోసం కేటాయించడం విశేషం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాల ద్వారానే ప్రజలకి జీవన స్థితిగతులు మెరుగుపడతాయని బలంగా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న కూడా ప్రజలకి ఇచ్చిన హామీలని నెరవేర్చడంపైనే ముఖ్యమంత్రి జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏకంగా 2లక్షల 79వేల 279 కోట్లు కాగా బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు. మూలధన వ్యయం రూ.31,061కోట్లు. ఇక సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులని కేటాయించారు.
వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు, జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు, వైయస్ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు, వైయస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు, జగనన్న చేదోడు రూ.350 కోట్లు, వైయస్ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు, వైయస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు వైయస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు, రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్ల, లా నేస్తం రూ.17 కోట్లు, జగనన్న తోడు రూ.35 కోట్లు, ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు, వైయస్ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు, వైయస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు, వైయస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు. అమ్మ ఒడి రూ.6500 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు, మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు, జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు మంజూరు చేశారు. ఇక ఈ సంక్షేమ బడ్జెట్ పై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది.