AP Government : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఒక కులాన్ని ఉద్దేశించి మీరు కొన్ని పదాలు పలికారా? మీ పని అంతే.. నాయీ బ్రాహ్మణులే కాదు.. వారి సామాజికవర్గాన్ని కించపరిచే విధంగా ఉన్న కొన్ని పదాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి వంటి పదాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి అడపా దడపా కొందరు వాడుతూనే ఉంటారు. ఇకపై వాటిని ఉపయోగిస్తే సహించబోమని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తామని తెలిపింది.
అంతేకాదు.. ఆయా పదాలను ఉపయోగించిన వారిని భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు సైతం తీసుకోనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. జగన్ సర్కార్ తీసుకుని నిర్ణయంపై నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను తెలసుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ స్వాగతించారు.
AP Government : తెలంగాణలోనూ ఆ జీవో తేవాలి..
తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని నాయీ బ్రాహ్మణ సంఘం కోరుతోంది. ఏపీలో నాయి బ్రాహ్మణుల కోసం గతంలో కూడా జగనన్న చేదోడు అనే పథకాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అర్హులైన వారికి ఈ పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున ఏపీ ప్రభుత్వం అందజేస్తోంది. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు అవసరమైన చేతి పనిముట్లు, వారికి పెట్టుబడి కోసం జగనన్న చేదోడు స్కీమ్ కింద ప్రతి సంవత్సరం నగదును ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఇక ఇప్పుడు వారితో పాటు వారి సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యవహారంలో ఉన్న పదాలపై నిషేధం విధించి వారిలో ఆనందం నింపింది.