AP Politics: ఏపీలో రాజకీయ పరిణామాలుకి మారుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తి నేతలు అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని భావిస్తున్న నాయకులందరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ పదేపదే ఎమ్మెల్యేలకు పిలిచి 175 సీట్లు గెలవాలని ఒత్తిడి తెస్తూ ఉండడం, నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా ప్రజల్లోకి వెళ్లడం సాధ్యమయ్యే పని కాకపోవడంతో కొంతమంది నాయకులు సైలెంట్ అయిపోయారు. మరి కొంతమంది ఇప్పటినుంచే పార్టీకి మంగళం పడేసి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వస్తునే అధికార పార్టీకి వీలైనంత వరకు పొలిటికల్ డామేజ్ చేసి బయటకు రావాలని భావిస్తున్నారు. అలా చేయడం ద్వారా రాజకీయంగా తమ మైలేజ్ పెరుగుతుందని నాయకులంతా అనుకుంటున్నట్లుగా రాజకీయాల్లో వినిపిస్తుంది.
ఇదేలా ఉంటే వైసీపీ నుంచి వలస వస్తున్న నాయకులు అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వైపు ముందుగా దిక్కులు చూస్తున్నారు. ఆ పార్టీలో పోటీ చేసే అవకాశం ఉంటే చంద్రబాబు నారా లోకేష్ తో సంప్రదింపులు జరుపుతూ జంపింగ్ అయ్యే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా ఆ కూటమికి అధికారం వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో జనసేనలోకి వెళ్లడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే జనసేన పార్టీలో చేరడానికి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రని వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎన్నారైలు కూడా పవన్ కళ్యాణ్ తో అలాగే నాదెండ్ల మనోహర్ తో టచ్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ యువతకు పెద్దపీట వేసి మెజార్టీ స్థానాలు వారికి ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకోవాలంటే ఖచ్చితంగా బలమైన నాయకత్వం నియోజకవర్గాలలో ఉండాలి. ఈసారి ఎలా అయినా అధికారంలోకి రావాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కి ఇది చాలా అవసరమని రాజకీయ వర్గాల్లో మాట. ఈ నేపథ్యంలోనే జనసేన భావజాలం నచ్చి పార్టీలోకి వచ్చేవారికి పెద్దపీట వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డితో జనసేనకి సంబంధించిన కొంతమంది నాయకులు సంప్రదింపులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.
అలాగే వైసిపిలో అసంతృప్తి నేతలుగా ఉన్నవారు పవన్ కళ్యాణ్ కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజకీయ వర్గాలలో మీకు ఇస్తున్న మాట. ముఖ్యంగా గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు నిలబడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో అక్కడ ఉన్న నాయకులు జనసేనకి దగ్గరవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే మరో ఆరు నెలల్లో ఏపీలో రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయి అనేది పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.