Arjun Kapoor : బాలీవుడ్ నటుడు యంగ్ అండ్ డైనమిక్ హీరో అర్జున్ కపూర్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం కుత్తే విడుదలైంది. ఈ సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్ నటించిన మూవీ చూసిన బాలీవుడ్ హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా కుత్తే పోస్టర్‌ను తన స్టాటస్ లో పోస్ట్ చేసి అర్జున్ కపూర్‌ను ప్రశంసిస్తూ తన మనసులోని మాటలను పంచుకుంది. తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ పిక్ దానికి జోడించిన మెజేస్ ఇప్పుడు నెట్టిట్లో వైరల్ అవుతోంది. స్నేహితులు , కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ప్రదర్శన తర్వాత, మల్టీస్టారర్ చిత్రం థియేటర్లలో విడుదలైంది. గురువారం రాత్రి, మలైకా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌కి వెళ్లింది. అర్జున్ కపూర్ నటించిన కుత్తే పోస్టర్‌ను షేర్ చేస్తూ అద్భుతమైన సినిమా అని పొగడ్తలతో ముంచుతూ హార్ట్ ఏమోజీలను పోస్ట్ చేసింది. మీరు ఈ సినిమాను తప్పక చూడండి. అని ఆమె పోస్ట్‌తో పాటు ‘లెట్స్ గో టు మూవీస్’ స్టిక్కర్‌ను కూడా జత చేసింది.
అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆమె పోస్ట్‌కి ప్రతిస్పందిస్తూ ఆమెను “మై బిగ్గెస్ట్ చీర్లీడర్” అని పిలిచాడు. విశాల్ భరద్వాజ్ తనయుడు ఆస్మాన్ భరద్వాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం కుత్తే. ఇందులో అర్జున్, టబు, రాధిక మదన్, కొంకణ సెన్ శర్మ, నసీరుద్దీన్ షా ,శార్దూల్ భరద్వాజ్‌లు నటిస్తున్నారు. కుత్తేలో అర్జున్ పోలీసుగా నటిస్తున్నాడు. ట్రైలర్ విడుదల అనంతరం ఆయన ఒక ప్రకటనలో ప్రజలు, మీడియా, ఇండస్ట్రీ వారు అందరూ కుత్తే ట్రైలర్ ని ఇష్టపడ్డారు ఈ చిత్రంలో నా క్యారెక్టర్ ను చూడాలని ప్రజలు అనుకుంటున్నారని అది నాకు అర్థమైందని తెలిపాడు.
మలైకా కూడా గత ఏడాది తన రియాల్టీ షో మూవింగ్ ఇన్ విత్ మలైకాతో తెరపైకి వచ్చింది. ఇది ఫరాఖాన్, కరణ్ జోహార్ ,అమృతా అరోరాతో సహా ఆమె స్నేహితులు , కుటుంబ సభ్యులతో ఆమె జీవితం గురించి ఆమె వ్యక్తిగత సంభాషణలను చూపించే కార్యక్రమం. ఈ షోకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బోల్డ్ బ్యూటీ కావడం అందులోనూ బోల్డ్‌గా మాట్లాడుతుండటంతో అందరిని ఈ షో ఆకర్షిస్తోంది.
ఇక అర్జున్ మలైకా రిలేషన్ షిప్ విషయానికి వస్తే. ఏజ్ లో చాలా గ్యాప్ ఉన్నా, వీరిద్దరూ పెర్ఫెక్ట్ జోడి అని చాలా సందర్భాల్లో స్పష్టమైంది. వీరిద్దరూ సుదీర్ఘకాలంగా తమ రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్‌గా కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ ఇటీవల కొత్త సంవత్సరాన్ని పరిశ్రమలో తమ స్నేహితుడు అయిన వరుణ్ ధావన్ అతని భార్య నటాషా దలాల్ మరికొంతమందితో కలిసి వెళ్లిన హాలిడే ట్రిప్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ జంట సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తమ ఫాలోవర్స్ ను అలరించేందుకు తమ వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంది. మరి వీరి రిలేషన్ ఇలాగే కంటిన్యూ కావాలని మనమూ ఆశిద్దాం.