సోషల్ మీడియాతోనే నేమ్, ఫేమ్ కొట్టేసిన అషు రెడ్డి. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకొని కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసుకుంది. జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న ఈ బ్యూటీ నెట్టింట్లో చేసే అల్లరి మామూలుగా ఉండదు. నిత్యం తన ఫోటోషూట్లతో నెట్టింట మంట పెట్టడం అషు కి అలవాటు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో షూట్‌పై, దానిపై ఆమె జోడించిన ట్యాగ్ లైన్‌పై రెచ్చిపోయి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కెరీర్ పరంగా దూసుకెళ్తున్న అషూ రెడ్డి హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా ఫొటోలకు పోజులిస్తూ ఆ ఫోటో షూట్స్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఆమె షేర్ చేస్తున్న ఫోటోషూట్లను మీమర్స్,నెటిజన్లు దారుణమైన కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కాగా, తాజాగా అల్ట్రా మోడ్రన్ స్టైల్లో టార్న్ డెనిమ్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన అషూ.. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అంటూ ఒక పెద్దాయన చెప్పాడంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై అటాక్ చేస్తున్నారు.
పాపం వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే ‘చిరిగిన చొక్కా వేసుకున్నావ్ సరే.. మరి పుస్తకం కొన్నావా?’, ‘కొటేషన్ బాగుంది కానీ మరి మంచి పుస్తకం కొనుకున్నవా లేదా’ అని ప్రశ్నిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బుల్లితెరపై హవా నడిపిస్తూనే ప్రస్తుతం ‘ఫోకస్’ అనే సినిమా చేస్తోంది అషు రెడ్డి. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.