Badrinath Temple : భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ ఆలయం. ఈ మందిరం ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారం నుంచి నవంబర్ ప్రారంభం వరకు ఆరు నెలల పాటు తెరిచి ఉంటుంది. ప్రస్తుతం, శీతాకాల విరామం కోసం ఆలయాన్ని మూసేసారు. అయితే ఈ ఏడు ఈ ప్రాంతంలో తీవ్రమైన చలికి దట్టమైన మంచు దుప్పటి పరుచుకుంది. బద్రీనాథ్ ఆలయంతో పాటు ఆలయం ఉన్న పట్టణం మొత్తం 5 అడుగుల మేర మంచు పేరుకుపోయింది.

అలకనంద నది ఒడ్డున చమోలి జిల్లాలోని గర్వాల్ కొండ ట్రాక్‌లలో ఉన్న బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి దీనిని చార్ ధామ్ అని పిలుస్తారు. వైష్ణవ ఆలయాల్లో ఇది ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ప్రజలు భద్రినాథుడికి దర్శించుకుని తరిస్తుంటారు. తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకుంటారు భక్తులు. చార్ ధామ్ లో ఇతర ప్రదేశాలలో యమునోత్రి, గంగోత్రి , కేదార్‌నాథ్ లు ఉన్నాయి

ఈ మందిరం ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారం నుండి నవంబర్ ప్రారంభం వరకు ఆరు నెలల పాటు తెరిచి ఉంటుంది. ఈ సమయంలోనే భక్తులు లక్షలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం, శీతాకాల విరామం కావడంతో దేవాలయాన్ని మూసివేశారు. ఉత్తర భారతదేశంలోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో రాబోయే ఐదు రోజుల పాటు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

చలి తీవ్రత జనవరి 23 నుండి ప్రారంభమవుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. జనవరి 24 నుంచి విమానాల రాకపోకలపై చలి వాతావరణం ప్రభావితం చేస్తుందని అలా జనవరి 25 వరకు ఇదే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని మేఘావృతమైన ఆకాశం, తేలికపాటి చినుకులు, మైదానాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

అంతేకాదు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మునిగిపోతున్న జోషిమఠ్ పరిధిలోకే బద్రీనాథ్ కూడా వస్తుంది. బద్రీనాథ్‌ను సందర్శించే యాత్రికులు, జోషిమఠ్ గుండా వెళ్ళాలి, ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి ఏకైక మార్గం.
