ఈ మధ్య రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి కూడా ఆపాదిస్తూ వైసీపీ సోషల్ మీడియా, అధిష్టానం వివాదాలు సృష్టిస్తుంది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అభిమానులని పార్టీల వారీగా విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగానే చిన్న విషయాన్ని కూడా బూతద్దంలో చూపిస్తూ ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ ఫలోవర్స్ ఫ్యాన్స్ వార్ సృష్టించి లబ్ది పొందే ప్రయత్నం చేస్తారని గతంలో నారా లోకేష్ హెచ్చరించారు. అందుకు తగ్గట్లుగానే మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య , వీరసింహారెడ్డి సినిమాలపై నెగిటివ్ ప్రచారాలు చేసి అభిమానుల ముసుగులో కొంత మంది మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై నారా లోకేష్ ముందుగానే అలెర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ పెద్దగా జరగలేదు.
రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచి రావడం కూడా ప్లస్ అయ్యింది. అయితే బాలకృష్ణని వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో భాగంగా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ మధ్య జరిగిన సరదా `సంభాషణని ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే వెంటనే కొంతమంది అక్కినేని అభిమానులం అనుకుంటూ మీడియా ముందుకి వచ్చి హడావిడి చేశారు. అక్కినేని తొక్కినేని అంటూ అవమానించారు అంటూ గోల చేశారు. ఇక ఈ కామెంట్స్ పై నాగ చైతన్య, అఖిల్ కూడా ఒక లెటర్ లో రియాక్ట్ కావడం తో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎదురుదాడి చేశారు. అలాగే ఎస్వీఆర్ పై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేసారంటూ కొంత మంది కాపు నాయకులు అనుకుంటూ మీడియా ముందుకి వచ్చారు.
అయితేఏసీఆర్ మనవాళ్ళు దీనిపై వీడియో విడుదల చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యల్లో తమకి ఎలాంటి తప్పుడు అభిప్రాయం కనిపించలేదని పేర్కొన్నారు. మాకు బాలయ్యతో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, వాటిని చెడగొట్టే ప్రయత్నం కొంత మంది కుట్రపూరితంగా చేస్తున్నారని అన్నారు. ఇక తాజాగా అక్కినేని నాగేశ్వరరావుపై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, ఫ్లోలో అలా మాట్లాడాను అని చెప్పారు.ఏఎన్నార్ తో తనది బాబాయ్-అబ్బాయ్ బంధం అని, తాను ఎట్టి పరిస్థితిలో కూడా నాగేశ్వరరావుని అవమానించే విధంగా మాట్లాడను అంటూ తేల్చేశారు. దీంతో ఈ వివాదంతో రాజకీయ లబ్ది పొందాలని అకునునే కుట్రకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.