Balayya vs Nag : నందమూరి బాలకృష్ణ.. ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్‌తో మాంచి జోష్ మీదున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అటు ఓటీటీలోనూ.. బాలయ్య హోస్ట్‌గా రాణించిన విషయం తెలిసిందే. ఆహాలో ప్రసారమైన ‘అన్ స్టాపబుల్’కి హోస్ట్‌గా బాలయ్య అదరగొట్టారు. ఆయనలోని ఫన్ ఎలిమెంట్‌కు ఫిదా అయిన ప్రేక్షకులు ఆ షో కోసం టీవీలకు అతుక్కుపోయేవారు. ఇక షో సీజన్2’ కోసం కూడా ముస్తాబవుతోంది. అతి త్వరలో ఈ షో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య మరోసారి బుల్లితెరకు అభిమానులను కట్టిపడేయ బోతున్నారు.
‘అన్ స్టాపబుల్’ ఫస్ట్ సీజన్ ప్రారంభానికి ముందు ఎన్నో అనుమానాలు, ట్రోల్స్ వచ్చాయి. బాలయ్య హోస్టింగ్ చేయగలరా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ బాలయ్య అదరగొట్టేశాడు. హోస్టింగ్‌లో తానెవరికీ తీసిపోనని నిరూపించారు. ఈ అన్ స్టాబుల్ షో ఇండియా వైడ్ టాప్ షోగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఈ షో సీజన్ 2 త్వరలోనే రాబోతోందని టాక్. సరిగ్గా.. బిగ్‌బాస్ సీజన్ 6 ప్రారంభ సమయంలోనే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కూమా ప్రారంభమయ్యే అవకాశం ఉందట. రెండూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న షోసే. అయితే వీరిద్దరి హోస్టింగ్‌లో ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Balayya vs Nag : బాలయ్య, నాగ్ తలపడితే ఎలా ఉంటుందో చూడాలి..
‘మధుర క్షణాలకు ముగింపు ఉండదు కొనసాగింపే’ అంటూ బాలయ్య రెట్టింపు జోష్ తో ఈ షోని హోస్ట్ చేయబోతున్నాడు. అయితే ‘బిగ్ బాస్ 6’ కూడా సెప్టెంబర్ ఆరంభంలో ప్రారంభం కానుంది. ఈ షోకి కూడా భారీ క్రేజ్ ఉంది అన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. గత 5 సీజన్లు కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక ఈ సీజన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని చేయడంతో దీనికి తిరుగుండదని టాక్. బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న ప్రారంభం కాబోతోందని టాక్. ఇక బుల్లితెరపై బాలయ్య, నాగ్ తలపడితే ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. టీఆర్పీ రేసులో ఏ షో ముందుంటుందో చూడాలని అంతా భావిస్తున్నారు.