Warts : చర్మంపై పులిపిర్లు, పుట్టుమచ్చలు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూనే ఉంటాయి. వీటిని మనం లైట్ తీసుకుంటాం. దాదాపు పట్టించుకోం. అవి బాగా స్ప్రెడ్ అయిపోయి వికారంగా కనిపిస్తే తప్ప పట్టించుకోం. అయితే పులిపిర్ల పెద్దవిగా అయితే మాత్రం అనుమానించాల్సిందే.. వాటిని అవసరమైనంత తొందరగా తొలగించుకోవడం అత్యుత్తమం. తొలుత చిన్నగా కనిపించిన పులిపిర.. ఆ తరువాత భారీగా పెరిగి పెద్దదవ్వొచ్చు. అంతేకాకుండా క్రమంగా రంగులో మార్పు, బ్లీడింగ్ అవడం వంటివి కూడా కనిపించవచ్చు. ఇవే క్యాన్సర్‌కు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Warts : మెత్తగా కదులుతూ ఉంటే లైట్ తీసుకోవచ్చు కానీ..
పుట్టుకతో వచ్చే మచ్చలు ఎలాంటి హానినీ కలిగించవు కానీ.. 20 ఏళ్ల తర్వాత మచ్చలు ఏర్పడి, అవి సరైన ఆకారం లేకుండా, రంగు మారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే స్కిన్ క్యాన్సర్‌గా అనుమానించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అనేక ప్రాంతాల్లో మృదు కణజాలంలో ఏర్పడే కొవ్వు గడ్డలను లైపోమా అంటారు. ఇవే గడ్డలు మన అవయవాల మీద ఏర్పడితే జాగ్రత్త పడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇవి మెత్తగా కదులుతూ ఉంటే లైట్ తీసుకోవచ్చు కానీ టచ్ చేసినప్పుడు గట్టిగా రాయిలా ఉండి, గడ్డ కదలకుండా ఉన్నా, గడ్డలో మార్పులు కనిపించినా దాన్ని క్యాన్సర్ గడ్డగా అనుమానించాలి.
గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. లైపోమాలు నొప్పిని కలిగించవు. అలాగే క్యాన్సర్ కణుతులు కూడా తొలి దశలో నొప్పి కలిగించవు. కానీ పెరిగేకొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం పడడం వల్ల తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. పైగా నిర్లక్ష్యం చేస్తే మాత్రం చికిత్సకు స్పందించని స్థితికి చేరుకుంటాయి. అలాగే ఎండకు బహిర్గతమయ్యే ప్రదేశాల్లో చర్మం రంగు మారినా, మానిపోయిన పుండు స్కిన్ ప్యాచ్‌లా ఉండిపోయి, రక్తస్రావం జరుగుతున్నా వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. హర్షిందగిన విషయం ఏంటంటే.. చర్మ క్యాన్సర్లను నూటికి నూరు శాతం నయం చేయవచ్చు. క్యాన్సర్ సోకిన ప్రదేశాన్ని సర్జరీతో తొలగించడంతో పాటు, మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను కూడా లేజర్ చికిత్సతో నాశనం చేయవచ్చు. రేడియేషన్, కీమో థెరపీలు అవసరానికి తగ్గట్టు ఇవ్వడం జరుగుతుంది.