పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరి.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న పవన్ కల్యాణ్.. మరింత ఉత్సాహంతో తదుపరి చిత్రాలను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్, హరీష్ శంకర్, మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ ఎర్నేని కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ పిక్‌ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఆ పరమాత్మ అనుగ్రహం మనందరిపై ఉండాలి’ అని తెలుపుతూ ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రం తరపున హరీష్ శంకర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.. ఇలా పవన్ కల్యాణ్‌తో ఉన్న పిక్‌తో అందరిని సర్‌ప్రైజ్ చేశారు. ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో పవన్ కల్యాణ్‌కి తిరుగులేని హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుండటంతో సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతుందని ఇప్పటి నుండే అభిమానులు లెక్కలేసుకుంటుంన్నారు.
‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రం కంటే ముందు పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్‌ని పూర్తి చేయబోతున్నారు. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ చిత్ర షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఈ చిత్రం కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ మరో చిత్రం చేయనున్నారు.