పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘భీమ్లా నాయక్’. ఇందులో మరో హీరో రానా దగ్గుబాటి . ఈ సినిమా శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న రిలీజ్‌కు సిద్ధమైంది ఈ సినిమా. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు సింగిల్ కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను సెన్సార్ కమిటీ జారీ చేసింది. సినిమా సెన్సార్ పూర్తి అవ్వడం తో ‘భీమ్లా నాయక్’ మూవీ రాక కన్‌ఫర్మ్ అయినట్లే. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన భీమ్లా నాయక్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది.‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. థియేట్రికల్ హక్కులే తొంబై కోట్ల రూపాయలకు పైగానే తెచ్చి పెట్టాయని తెలుస్తుంది. ఇక నాన్ థియేట్రికల్ హక్కుల పరంగా చూస్తే ఇందులో శాటిలైట్, డిజిటల్ ఇతరత్రా హక్కులన్నింటినీ కలిపితే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలకు పైగానే వచ్చినట్లు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమా డిజిటల్ హక్కులను రెండు సంస్థలు దక్కించుకున్నట్లు సినీ సర్కిల్స్ లో సమాచారం. అందులో డిస్నీ హాట్ స్టార్‌తో పాటు తెలుగు ఓటీటీ మాధ్యమం అయిన ఆహా కూడా ఉంది.తెలుగు నిర్మాత, మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ భీమ్లా నాయక్ డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా పవన్ కళ్యాణ్ మూవీ అల్లు అరవింద్ చేతికి వెళ్లిందన్నమాట. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్‌కు రీమేక్‌గా భీమ్లా నాయక్ గా రూపొందింది. ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఒక పాట కూడా రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు.