మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్- అనిల్ సుంకర కాంబినేషన్ లో వస్తున్న మెగా భారీ చిత్రం భోళా శంకర్
ఫస్ట్ లుక్ విడుదలైంది. మెగాస్టార్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారని సమాచారం. ఈ రోజు మహా శివరాత్రి శుభ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసారు.ఇది వైరల్ గా దూసుకుపోతోంది.
వైబ్ ఆఫ్ భోలా అనే ఫస్ట్ లుక్ పోస్టర్ చిరంజీవిని స్టైలిష్ అండ్ బెస్ట్ అవతార్ లో వచ్చేసింది. అతని డ్రెస్సింగ్ దగ్గర్నుంచి సిట్టింగ్ పొజిషన్ వరకు చేతిలోని చైన్ ని తిప్పే విధానం వరకు చూస్తుంటే చిరులోని మాసిజాన్ని మెహర్ ఒక రేంజులో ఆవిష్కారిస్తున్నారని అర్థమవుతోంది. శివుని శక్తివంతమైన ఆయుధం అయిన త్రిశూలం చిరంజీవి చేతి వేళ్లపై అలా గిర్రున తిరుగుతుంటే ఫ్యాన్స్ గుండెలు గుబగుబా గిర్రున్న తిరిగేస్తున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన గొలుసును హైలైట్ చేయడం ఈ పోస్టర్ విశేషం. చిరు అల్ట్రా స్టైలిష్ లుక్ నిజంగానే అభిమానులకు హుషారెక్కిస్తుందని చెప్పాలి.
స్పోర్టింగ్ షేడ్స్ లుక్ లో ఎంతో స్టైలిష్ గా ఉంది. ఇక చిరంజీవి జీపు బంపర్‌పై కూర్చొని ఉన్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఇలా డిజైనర్ లుక్ లో చిరును చూడటం ఒక కన్నుల పండుగ. మెగాస్టార్ కి ఎలివేషన్ ఇస్తూ బ్యాక్ గ్రౌండ్ లో జనం సంగీత వాయిద్యాలతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ మెగా అభిమానులతో పాటు సినీ అభిమానుల్లోకి వెళుతుంది. మహతి స్వర సాగర్ అందించిన అత్యఅద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పోస్టర్ నేపథ్యాన్ని ఎలివేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
హీరయిన్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా.. డాజ్లింగ్ బ్యూటీ తమన్నా ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో హెరాయిన్ గా కనిపించనుంది. ఇందులో భావోద్వేగాలు డ్రామా ఇతర అంశాలు ఈక్వల్ రేషియో లో ఉండబోతున్నాయి.
క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డడ్లీ కెమెరా వర్క్ చేస్తున్నాడు. దీనికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ .. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భోళా శంకర్ ని ఈ ఏడాది థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
Celebrate this MahaShivarathri with the #VIBEofBHOLAA ⚡
Here’s MEGA🌟@KChiruTweets as #BholaaShankar 🔱
BholaaShankarFirstLook
@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar