Bhopal : మధ్యప్రదేశ్ హోం శాఖా మంత్రి నరోత్తమ్ మిశ్రా దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్ లు నటించిన పఠాన్ చిత్రంలోని ఒక పాట పై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసారు. ఈ పాటలో నటి దీపికా పదుకొణె బికినీపై మండిపడ్డారు. ఈ సాంగ్ లోని కొన్ని సన్నివేశాలను సరిదిద్దకుంటే ప్రభుత్వం ఏమి చేయాలో ఆలోచిస్తుందని అన్నారు.
ఈ పాటలో కనిపించే బికినీలు అత్యంత అభ్యంతరకరమైనవిగా ఉన్నాయన్నారు. ఈ పాట కలుషిత మనస్తత్వం నుండి చిత్రీకరించబడినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోర్‌లోని మోవ్ జిల్లాలో విలేకరులతో మిశ్రా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా మాటాడుతూ ఈ పాటలోని కొన్ని సీన్స్ లో దీపికా దుస్తులను సరిచేయమని నేను అభ్యర్థిస్తున్నాను అని అయన అన్నారు. లేకపోతే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్‌లో అనుమతించాలా వద్దా అనేది పరిశీలించాల్సి వస్తుందన్నారు. దీనికి అదనంగా జెఎన్‌యు కేసులో చూసినట్లుగా పదుకొణె తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతుదారు అని ఆయన ఆరోపించారు. 2016లో ఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన నిరసన నేపథ్యంలో బిజెపి నాయకులు వారి మితవాద గ్రూపులు తరచుగా “తుక్డే-తుక్డే గ్యాంగ్” వ్యాఖ్యను ఉపయోగిస్తాయి. ప్రస్తుతం ఈ ట్యాగ్ ను దీపికకు జోడించారు.
మిశ్రా అక్టోబర్‌లో రామాయణం ఆధారంగా తీసిన బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్” నిర్మాతలను, హిందూ మతపరమైన వ్యక్తులను “తప్పు” మార్గంలో చూపించే దృశ్యాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .
యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా పఠాన్ జనవరి 25న బిగ్ స్క్రీన్ పైన విడుదల కానుంది. ఈ మూవీ కి సంబంధించిన మొదటి పాటను ఈ మధ్యే యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ లో దీపికా ఎంతో హాట్ గా కనిపించింది. అయితే పాత మధ్యలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో మినిస్టర్ మిశ్ర రంగం లోకి దిగి పాటను సవరించాలని సూచించారు .