Bhumi Pednekar : బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను ఫిదా చేస్తోంది. బోల్డ్ అండ్ స్టైలిష్ ఫ్యాషన్‌తో ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. భూమి పెడ్నేకర్ తన నటనతో మాత్రమే కాదు ఆమె వినయపూర్వకమైన వ్యక్తిత్వానికి కూడా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఇక ఫ్యాషన్ రంగంలోనూ తనదైన సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో, లేటెస్ట్ ఫ్యాషన్ ఎంపికలతో కూడా ముంబైలో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది భూమి. తాజాగా జరిగిన ఒక అవార్డ్ షో కోసం ధరించిన అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియుల హృదయాలను గెలుచుకుంది. రెడ్ కార్పెట్‌పై పూర్తి నలుపు రంగులో వచ్చిన డిజైనర్ అవుట్‌ఫిట్ ధరించింది అందరి చూపును తనవైపు తిప్పుకుంది భూమి పెడ్నేకర్.
భూమి పెడ్నేకర్ తనదైన వైవిధ్యమైన నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యాషన్ రంగంలోనూ తనదైన స్టైల్స్‌తో ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ అవుట్ ఫిట్స్ ధరించి ఈ బ్యూటీ చేసే ఫోటో షూట్‌లు నెట్టింట్లో మంటలు రేపుతుంటాయి.
మోడ్రన్ అవుట్‌ఫిట్స్ నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు అన్నింటిని తనదైన స్టైలిష్ లుక్స్‌ను జోడించి ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. తాజాగా రెడ్ కార్పెట్ లుక్ కోసం వేసుకున్న బ్లాక్ అవుట్‌ఫిట్‌లోనూ ఈ భామ బోల్డ్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. భూమి పెడ్నేకర్ బ్లాక్ బ్రాలెట్ వేసుకుని దానికి జోడీగా అదే రంగులో డిజైన్ చేసిన స్కర్ట్ ధరించింది. ఈ అవుట్‌ఫిట్ కు వచ్చిన ఫిష్‌నెట్ కేప్ భూమికి ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చింది.
భూమీ ధరించిన ఈ బ్లాక్ అవుట్‌పిట్ ను ఫరాజ్‌మనన్ డిజైన్ చేశాడు. అన్మోలీ జ్యువెల్లరీ నుంచి ఆభరణాలను ఎన్నుకుంది. ప్రముఖ స్టైలిస్ట్‌లు మోహిత్ రాయ్ ,శుభి కుమార్‌లు భూమి పెడ్నేకర్‌కు స్టైలిష్ లుక్స్ ను అందించారు. మినిమల్ మేకప్ లుక్స్‌లోనూ ఎంతో గ్లామరస్‌గా కనిపించింది ఈ చిన్నది. భూమి పెడ్నేకర్ తన కనులకు స్మోకీ బ్లాక్ ఐ ష్యాడో, పెదాలకు న్యూడ్ పింక్ లిప్‌స్టిక్ పెట్టుకుని సాఫ్ట్ గ్లామ్ మేకప్ లుక్ తో అదరగొట్టింది.
రీసెంట్‌గా చేసిన మరో ఫ్యాషన్ ఫోటో షూట్‌లో గ్రీన్ కలర్ కో ఆర్డ్ సెట్‌లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది ఈ చిన్నది. తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం భూమి గ్రీన్ కలర్ ప్లెయిన్ కటౌట్ బ్లౌజ్, ఫ్రిల్డ్ స్కర్ట్ ను ధరించింది. షోల్డర్ లెస్ బ్లౌజ్‌లో భూమి ఎంతో హాట్ గా కనిపించింది. ఇక తన బొడ్డు అందాలను స్పష్టంగా చూపించేలా ఫోటో షూట్ చేసి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ చిన్నది.
ఈ అదిరిపోయే గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్‌ను భూమి గ్రేటెల్డ్ మిలానో ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. ఆభరణాలను అన్మోలి జ్యువెల్లర్స్ నుంచి ఎన్నుకుంది. మోహిత్ రాయ్, శుభి కుమార్‌లు భూమికి స్టైలిష్ లుక్స్‌ను అందించారు. మినిమల్ మేకప్‌లో, సింపుల్ జ్యువెల్లరీలో తన అందాలను ఆరబోస్తూ భూమి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.