Bigboss 6 : హమ్మయ్యా.. ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ప్రోమో రానే వచ్చింది. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 4 అని చెబుతూ వస్తున్నాం. అయినా కూడా ఎక్కడో కాస్త సందేహం. ఆ సందేహాలన్నింటికీ చెక్ పెడుతూ బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ చేశాడు. ముఖ్యంగా షో అనుకున్న నాటి నుంచే ప్రేక్షకుల్లో ఎప్పుడు మొదలవుతుందా? అసలు ఈ షో ఇప్పట్లో ఉంటుందా? లేదంటే ఛానల్స్ ఊరికే ఊదరగొట్టేస్తున్నాయా? అన్న సందేహాలు మొదలైపోయాయి. ఈ డౌట్స్ అన్నింటికీ చెక్ పెడుతూ తొలుత బిగ్‌బాస్ లోగో విడుదల చేశాడు.
ఇక అంతే సందేహం లేదు.. త్వరలో షో ఉంటుందని జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే సందేహమే లేదు.. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పర్తై పోయింది. వీరందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవలే ఓ ప్రోమోను విడుదల చేసి త్వరలోనే బిగ్‌బాస్ షో ఉండబోతుందన్న సంకేతాలను నిర్వాహకులు ఇచ్చేశారు. తాజాగా కూడా మరో ప్రోమో విడుదల చేశారండోయ్.. ఇక దానిలో రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. అది మరెప్పుడో కాదు.. మనం ముందుగా అనుకున్నట్టే సెప్టెంబర్ 4. ఇక ఎలాగూ సాయంత్రం 6 గంటల నుంచి షో ప్రారంభమై పోతుంది.
Bigboss 6 : అట్టా ఎర్రి మొహమేసుకుని సూత్తావేంట్రా..
బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో పిల్లలందరూ క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో సడన్‌గా బౌలర్ బంతి పట్టుకుని నేరుగా ఇంట్లోకి దూరిపోయాడు. బ్యాట్స్‌మెన్ తిరిగి చూసేవరకూ అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. అతనికేం అర్ధం కాక దిక్కులు చూస్తుంటాడు. అప్పుడు కింగ్ నాగార్జున ఎంట్రీ. అట్టా ఎర్రి మొహమేసుకుని సూత్తావేంట్రా.. ఇక్కడ ఆట ఆగిందంటే అక్కడ అసలైన ఆట మొదలైనట్లే.. అంటూ బిగ్‌బాస్ కొత్త సీజన్ వచ్చే నెల నాలుగు నుంచి ప్రసారం కానుందని ప్రకటించాడు. కొత్త కంటెస్టెంట్ల కోసమే కాదు, నాగ్ మామ కోసం కూడా వెయిటింగ్ ఇక్కడ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేయడం ప్రారంభించేశారు.