Bigboss Contestant : బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మెహబూబ్ తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి మృతిపై తల్లడిల్లుతూ మెహబూబ్ పెట్టిన పోస్ట్ అతని అభిమానులతో కంటతడి పెట్టిస్తోంది. నువ్వు లేకుండా ఎలా బతకాలి?.. ఎలా నిర్ణయాలు తీసుకోవాలి? అంటూ మెహబూబ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తమ్ముడిని, తండ్రిని బాగా చూసుకుంటానంటూ మాటిచ్చాడు.జీవితంలో అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అదే విషయాన్ని మెహబూబ్ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సుదీర్ఘ మెసేజ్‌లో మెహబూబ్ ఏం చెప్పాడంట..
”అమ్మా.. నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. ఇకపై నేను నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ(అమ్మా)? నువ్వు లేకుండా ఎలా బతకాలి? నువ్వు లేని నా జీవితాన్ని నేనెప్పుడూ ఊహించలేదు. మీరు ఎప్పుడూ నన్ను ఒకదానికే పరిమితం చేయలేదు. ఈ క్రమంలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్న నన్ను చూసి చాలా సంతోషించారు. నా ఒడిదుడుకులలో నువ్వు ఎప్పుడూ తోడుగా ఉన్నావు. నువ్వు ఎప్పుడూ నీ మాటలతో మనోధైర్యాన్ని అందించావు. ఆ మాటలు నాకు ఎప్పటికీ ప్రేరణగా ఉంటాయి’’ అని పేర్కొన్నాడు.
Bigboss Contestant : అంతా క్షణాల్లో జరిగిపోయింది..
ఇంకా మెహబూబ్ తన పోస్టులో.. ‘‘నువ్వు మా కోసం చాలా శ్రమించావు. మమ్మల్ని చూసుకోవడం కోసమే జీవితంతో పోరాడావు. ఎవరూ చేయనంతగా నువ్వ మా కోసం చాలా చేశావు. నువ్వు మా కోసం సర్వస్వం త్యాగం చేశావు. అమ్మా.. నువ్వు లేకుండా నా జీవితం ఎలా/ఎక్కడికి వెళుతుందో నాకు తెలియదు. నేను నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతూనే ఉంటా అమ్మా. జీవితం అంటే ఏమిటో నేర్పింది నువ్వు.. అమ్మా.. నువ్వు నన్ను చూస్తూ ఉంటావని నాకు తెలుసు.. నేను సుభాన్(తమ్ముడు), నాన్నలను చాలా బాగా చూసుకుంటానని మాటిస్తున్నా’’ అని తెలిపాడు. ఈ నెల 5వ తేదీ తనకో పీడకల అని… అంతా క్షణాల్లో జరిగిపోయిందని.. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలిపాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ‘స్టే స్ట్రాంగ్’ అంటూ మెహబూబ్‌కు ధైర్యం చెబుతున్నారు.