Bigboss 6 : బుల్లితెర మీద విశేషంగా ఆకట్టుకొంటున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ తెలుగు 6 ఒకటి. గత ఐదు సంవత్సరాలుగా ఐదు సీజన్లతో భారీగా ఫాలోయింగ్‌ను ఈ షో సంపాదించుకొన్నది. ఇప్పటికే ఎంతో మంది బిగ్‌బాస్ షోలో పాల్గొని ఓవర్‌నైట్‌లో సెలబ్రిటలుగా మారిపోయారు. మరికొందరు మాత్రం చాలా చెత్త పేరు తెచ్చుకుని కెరీర్‌ను సర్వనాశనం చేసుకున్నారు. ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకొన్న ఈ షో త్వరలోనే 6వ సీజన్‌తో ముందుకొస్తున్నది. ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమో సైతం విడుదలైంది. ఇక కంటెస్టెంట్‌ల లిస్ట్ సైతం వైరల్ అవుతోంది.
తెలుగు వినోద పరిశ్రమలో బిగ్‌బాస్ భారీ ఫాలోయింగ్‌తో టాప్ రేటింగ్ షోగా రికార్డులు నెలకొల్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక వీకెండ్స్‌లో అయితే ఈ షో రేటింగ్స్‌లో దుమ్ము రేపుతుంది. దేశంలోనే అత్యుత్తమ రేటింగ్‌ను సంపాదించుకొన్న షోగా బిగ్‌బాస్ తెలుగు షో ఘనతను సాధించింది. ఈ ఫార్మాట్ షోకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను చూసి ఇటీవల ఓటీటీ ద్వారా 24 గంటలపాటు బిగ్‌బాస్ షోను ప్రసారం చేసి సక్సెస్ అయ్యారు. అయితే కొందరు మాత్రం ఓటీటీలో ప్రసారమైన కారణంగా వీక్షించలేకపోయారు. దీంతో ఈసారి షోను అందరికీ అందుబాటులో ఉండేలా స్టార్ మాలోనే నిర్వాహకులు ప్రసారం చేయనున్నారు.
Bigboss 6 : కట్టుదిట్టంగా నోట్..
ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6కి సంబంధించి కంటెస్టెంట్ల లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. 16 మంది కంటెస్టెంట్స్ షోలోకి అడుగు పెట్టబోతున్నారు. వీరిలో 12 మంది ముందుగా.. నలుగురు తర్వాత హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నట్టు టాక్. ఎలా అడుగు పెడితే ఏముందిలే కానీ.. తాజాగా ఈ షో గురించి ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది. గతంలో కంటెస్టెంట్లు అనారోగ్య కారణాలతోనో.. లేదంటే బిగ్‌బాస్ హౌస్‌లోనో ఉండలేక బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో సంపూర్ణేష్ బాబు, మధు ప్రియలు బిగ్‌బాస్ హౌస్‌లో ఉండలేక బయటకు వచ్చేశారు. అలాగే సింగర్ నోయల్, జశ్వంత్‌లు అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చారు. ఈసారి ఎలాంటి అనారోగ్య సమస్యలతో బయటకు రాకుండా ఉండేందుకు కంటెస్టెంట్స్‌ను ముందుగానే క్వారంటైన్ చేస్తున్నారు. ఈ సమయంలో ఏమైనా అనారోగ్య సమస్యలున్నట్టు తెలిస్తే వారు ఇంటికే. అలాగే హౌస్‌లో ఉండలేక బయటకు రాకుండా కట్టుదిట్టంగా నోట్ రాయించుకుంటున్నట్టు సమాచారం.