ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ ఓటీటీ ఈనెల 26నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. రెగ్యులర్ బిగ్‌బాస్‌కి ఏమాత్రం
తగ్గకుండా ఈసారి అంతకుమించి అనేంతలా షో ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత సీజన్స్‌లో పాపులర్ కంటెస్టెంట్లతో పాటు కొత్త కంటెస్టెంట్లతో 24గంటల పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యింది. ఇప్పటికే అందుకు తగ్గట్లు బిగ్‌బాస్ సెట్ సైతం మరింత అందంగా తయారైంది.ఇక ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓవైపు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది, కొందరు కంటెస్టెంట్ల ఫేసులు కూడా రివీల్ అయిపోయాయి వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ స్టేజ్‌పై కంటెస్టెంట్ల ఇంట్రో పర్‌ఫామెన్సుల వీడియో క్లిప్పింగులు ఇప్పుడు నెట్టింట దర్శనమిచ్చాయి. అఖిల్ సార్థక్, అరియానా గ్లోరీ, అషు రెడ్డి, హమీదా, అనిల్ రాథోడ్(మోడల్), తేజస్విని, సరయు, యాంకర్ స్రవంతిల ఫోటోలు లీకయ్యాన సంగతి తెలిసిందే. గత సీజన్స్ కంటే మరింత గ్రాండ్‌గా హౌస్ ముస్తాబయ్యింది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో ఈ నెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రోమోను వదిలిన మేకర్స్ అందుకు తగ్గట్లుగానే షోను ప్లాన్ చేసారు. మరి ఈసారి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న బిగ్‌బాస్ షో ఎలా ఉంటుందన్నది ముందుముందు చూడాల్సిందే.