Bigboss Show : బిగ్‌బాస్ తెలుగు 6వ సీజన్‌కి సంబంధించిన ప్రోమో షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్నా ఈ రియాలిటీ షో.. అతి త్వరలోనే ఆరవ సీజన్లోకి అడుగు పెట్టబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో షూటింగ్ ఇటీవలే పూర్తైనట్టు సమాచారం. ఐదు సీజన్లు కూడా అదిరిపోయే రేటింగ్‌తో ముందుకు సాగడంతో నిర్వాహకులు వీలైనంత త్వరగా సీజన్ 6ను ప్రారంభించేదుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వర్షాల కారణంగా సెట్ నిర్మాణంలో కాస్త ఇబ్బందులు తలెత్తుతుండడటంతో కాస్త సమయం అటు ఇటు అవుతోందని సమాచారం. అయితే ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక సైతం పూర్తయినట్టు తెలుస్తోంది.
Bigboss Show : ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా ఎన్టీఆర్
ఇకపోతే.. ఇప్పటి వరకూ హోస్ట్ విషయంలో జనాలకు ఎలాంటి సందేహమూ లేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రోమో షూటింగ్ తర్వాత అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫస్ట్ సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా.. అదరగొట్టేశాడు. మళ్లీ ఎన్టీఆరే తర్వాతి సీజన్‌కు సైతం హోస్ట్‌గా అంతా కోరుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ససేమిరా అనేశాడు. దీంతో నేచురల్ స్టార్ నాని రంగంలోకి దిగాడు. నాని హోస్టింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. కొందరికి ఫేవర్‌గా ఉన్నాడంటూ జనం ఏకిపారేశారు. ఆ ప్రభావం తన సినిమాలపై కూడా పడే అవకాశం ఉందని భావించిన నాని.. తర్వాతి సీజన్‌కు తప్పుకున్నాడు.
ఇక మూడో సీజన్లో కింగ్ నాగార్జున అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఐదవ సీజన్ వరకూ కూడా నాగార్జునే ఎలాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక నాగ్ హోస్టింగ్‌తో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో ప్రేక్షకులు సైతం ఆయన్ను యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఆరో సీజన్‌కు మాత్రం ఆయన హోస్ట్‌గా ఉండరనే టాక్ బలంగా వినిపిస్తోంది. అటు సినిమా షూటింగ్స్.. ఇటు బిగ్‌బాస్.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కాస్త కష్టమైన వ్యవహారమే. దీంతో ఈసారికి మాత్రం ఆయన ఈ షోకి కాస్త దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు టాక్. మరోవైపు ఆయన తప్పుకునే సమస్యే లేదని.. ఈ సారి కూడా హోస్ట్‌గా కొనసాగుతారని కొందరు చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే ప్రోమో విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.