బిగ్ బాస్ స్టార్ మా లో 5 సీజన్లుగా తెలుగు టెలివిజన్ లో పెద్ద సంచలనం. ఈ అద్భుత సంచలనాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేయబోతుంది”డిస్నీ ప్లస్ హాట్ స్టార్”. ఓటీటీలో 24 గంటలు “బిగ్ బాస్” ని అందుబాటులోకి తీసుకొస్తుంది.
“డిస్నీ ప్లస్ హాట్ స్టార్”లో ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుండి “బిగ్ బాస్” కొత్త సంచలనాలకు తెర తీయనుంది. బిగ్ బాస్ అనగానే ప్రేక్షకులకు వెంటనే వచ్చే ప్రశ్న – హౌస్ లో ఎవరు ఎవరు ఉండబోతున్నారు ? అని. ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరకబోయే రోజు ఫిబ్రవరి 26 నే.
ఇక ఇప్పుడు “బిగ్ బాస్” ఒక గంటే కాదు. “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో నాన్ స్టాప్ సందడి చేయబోతోంది. అందుకే ఇప్పుడు ఓటీటీలో వచ్చే బిగ్ బాస్ కి టాగ్ లైన్ .. “నో కామా… నో ఫుల్ స్టాప్… బిగ్ బాస్ ఇప్పుడు నాన్ స్టాప్” గా ప్రసారం అవ్వడానికి సిద్ధం గా ఉంది !!
ఇక ప్రేక్షకులకు “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో పండగ కాబోతుంది బిగ్ బాస్.. హౌస్ ని నడిపించడంలో తనదైన స్టైల్ చూపించే నాగార్జున ఓటీటీలో ఎలా డీల్ చేయబోతారు అనే ప్రశ్నకు కూడా ఫిబ్రవరి 26 న సాయంత్రం 6 గంటల నుంచే సమాధానం దొరకబోతుంది.