Bigg Boss Review: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సోమవారం ఎపిసోడ్ లో ముందుగా హౌస్ లో ముందుగా శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ మధ్య డిస్కషన్ జరగుతుంది. రాజ్ హౌస్ లో నుండి బయటకి వెళ్లిపోయినందుకు ఫైమా బాధపడుతుంది. తర్వాత బిగ్ బాస్ హౌస్ లో రేషన్ మేనేజర్ గా ఉన్న రోహిత్ ని కన్ఫెషన్ రూంకి పిలుస్తాడు. హౌస్ లో సభ్యులు ఆహారాన్ని వేస్ట్ చేయడంతో పాటు అపరిశుభ్రంగా ఉంచిపెట్టడంపై బిగ్ బాస్ సిరియస్ అవుతాడు.
ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అని రోహిత్ అంటాడు. అందుకు ఈ వీక్ లగ్జరి బడ్జెట్ క్యాన్సెల్ చేయడం అని రోహిత్ బిగ్ బాస్ కి చెప్తాడు. తర్వాత ఎప్పటిలాగే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ముందుగా నామినేషన్స్ ని ఆదిరెడ్డి స్టార్ట్ చేస్తాడు. రేవంత్ మరియు రోహిత్ ని ఆదిరెడ్డి నామినేట్ చేస్తాడు. ఈ క్రమంలో రేవంత్, ఆదిరెడ్డి మధ్య లాస్ట్ వీక్ గేమ్ టాస్క్ కు సంబంధించిన విషయంపై వార్ కొనసాగింది.
తర్వాత మరలా రేవంత్ మరియు రోహిత్ ను ఫైమా నామినేట్ చేస్తుంది. ఫైమా నామినేషన్ కాస్త సైలెంట్ గానే కొనసాగింది. తర్వాత ఆదిరెడ్డి, రోహిత్ ని నామినేట్ చేస్తాడు. మరోసారి రేవంత్ తో పాటు శ్రీసత్యను కీర్తి నామినేట్ చేస్తుంది. లాస్ట్ వీక్ తనను వెటకారం చేసినందుకు శ్రీసత్యను కీర్తి నామినేటస్ చేస్తుంది. ఇక అనుకున్నట్లుగానే తిరిగి కీర్తిని శ్రీసత్య నామినేట్ చేస్తుంది. ఇక ఆదిరెడ్డిని కూడా శ్రీసత్య నామినేట్ చేస్తుంది.
ఆదిరెడ్డి, ఫైమాను రేవంత్ నామినేట్ చేస్తాడు. ఈ క్రమంలో ఫైమా, రేవంత్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఇకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటారు. రేవంత్ మరియు శ్రీసత్యను ఇనయ నామినేట్ చేస్తుంది. చివరగా ఈ వారం నామినేషన్స్ లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, ఫైమా, శ్రీసత్య, కీర్తి ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించడంతో సోమవారం ఎపిసోడ్ ముగుస్తుంది.