బిగ్ బాస్ షోలో విన్నర్ గా నిలిచి, ఫేమస్ అయిన కౌశల్.. మొత్తానికి హీరోగా తన మొదటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ అనే ట్యాగ్ తప్పా కౌశల్‌కు ఇంత వరకు మరే గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ షోతో కౌశల్‌కు ఎంత ఫేమ్ వచ్చిందో అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా వచ్చింది. కౌశల్ ఆర్మీ పేరు ఆమధ్య ఎంతగా ట్రోలింగ్‌కు గురయిందో తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన కౌశల్.. హీరోగా చాలా ప్రయత్నాలు చేశాడు.కానీ ఈ మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమాకి కూడా హీరో గా చేయలేకపోయాడు. కారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అవకాశాలు వచ్చినా కూడా ,హీరోగానూ ప్రయత్నాలు చేశాడు. ఇక ఇప్పుడు తన కొత్త చిత్రం రైట్ అప్డేట్ వచ్చింది. రైట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేసాడు. ఈ సందర్భంగా వెంకీ మామతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు కౌశల్.ముచ్చటగా మూడుసార్లు కలిశాడట. వెంకీమామతో కలిసిన కౌశల్ మూడు ఘటనలను పంచుకున్నాడు. స్వర్ణకమలం షూటింగ్ సమయంలో ఓ సారి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడట. వైజాగ్‌లో తన తాత ఇంటి పక్కనే ఆ షూటింగ్ జరిగిందట. ఆ తరువాత చాలా ఏళ్లకు బిగ్ బాస్ షో వేదికగా.. హీరో వెంకటేష్ చేతుల మీదుగా టైటిల్, కప్ తీసుకున్నాడట. ఇప్పుడు తన మొదటి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించానని, తన జీవితంలో వెంకీ మామకు ప్రత్యేక స్థానం ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు కౌశల్.ఇక ఈ రైట్ మూవీ మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి . మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ సినిమా రీమేక్ ఇది. శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ మరియు లుకలాపు మధు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో లీషా ఎక్లైర్స్ హీరోయిన్గా చేస్తుంది.