Bill Gates : ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు బిల్ గేట్స్. 67 ఏళ్ల వయసులోనూ ప్రేమల పడి అందరిని షాక్‌కు గురిచేస్తున్నారు. బిల్ గేట్స్ తాజాగా 2019లో మరణించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ సీఈఓ మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నారని సమాచారం. సోర్సస్ ప్రకారం ఈ 67 ఏళ్ల మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, పౌలాతో ప్రేమలో పడ్డాడని, ఆమెతో డేటింగ్ చేస్తున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితో ఓ సోర్స్ ప్రకారం వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని అయితే హర్డ్ ఇంకా బిల్ గేట్స్ పిల్లలను కలవలేదని చెబుతున్నారు.

గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగారు. బిల్ గేట్స్, పౌలా హార్డ్ పక్కపక్కనే కూర్చొని ఆటను చూస్తున్నట్లు కనిపించే పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. గత సంవత్సర కాలంగా వీరిద్దరూ కలిసే ఉన్నారని ఈ కపుల్ ఫ్రెండ్ విషయాన్ని లీక్ చేశాడని తెలుస్తోంది. అయితే ఆమె ఎప్పుడూ అందరికీ మిస్టరీ ఉమెన్‌గా నే ఉండేదని, కానీ వారి ఇన్నర్ ఫ్రెండ్స్ సర్కిల్ లో మాత్రం వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని స్పష్టంగా తెలుసనని తెలిపారు. హర్డ్ భర్త క్యాన్సర్‌తో సుదీర్ఘ కాలం పోరాటం చేసి అక్టోబర్ 2019లో, 62 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ సీఈఓ. ప్రస్తుతం పౌలా హర్డ్ ఈవెంట్ ప్లానర్ గా, ఫిలాంత్రపిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమె ఒకప్పుడు టెక్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది.

పేజ్‌సిక్స్ నివేదిక ప్రకారం, పౌలా హర్డ్ , బిల్ గేట్స్ ఒకే విధంగా ఆలోచిస్తారని , టెన్నిస్ పట్ల వారికున్న ప్రేమ కారణంగా మార్క్ మరణానికి ముందు వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని సమాచారం. గత నెల, వారు మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. మెల్‌బోర్న్ లో చెక్కర్లు కొడుతున్న సమయంలోనే వీరిద్దరిపై రోమాన్స్ రూమర్స్ వచ్చాయి. అయితే అప్పుడు ఆమె ఎవరు అన్నది ఎవరూ గుర్తించలేకపోయారు.

మెలిండా ఫ్రెంచ్ గేట్స్ మరియు బిల్ గేట్స్ దాదాపు 30 సంవత్సరాల వివాహం జీవితం అనంతరం మే 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆగష్టు 2021లో వీరి డైవర్స్ క్లియర్ అయ్యింది. భార్యా భర్తలుగా విడిపోయినా ఈ జంట మాత్రం తమ ఫౌండేషన్ అయిన బిల్ , మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను కలిసి నిర్వహిస్తున్నారు.