Bindu Madhavi : సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం దాదాపు తగ్గిపోయింది. వీలు చిక్కినప్పుడల్లా సెలబ్రిటీలు.. అభిమానులతో ముచ్చటిస్తూ వారికి ఆనందాన్ని పంచుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలకు వారి పర్సనల్, కెరీర్‌కి సంబంధించిన ప్రశ్నలు సర్వసాధారణంగా ఎదురవుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని అసహనానికి గురి చేసే కామెంట్స్ కూడా ఎదురవుతుంటాయి. అయితే కొన్ని సార్లు నెటిజన్ చూసే ధోరణిని తప్పుబట్టలేం. తమ కళ్ల ముందు మంచి డ్రెస్సింగ్ సెన్స్‌తో హూందాగా కనిపించిన ఓ వ్యక్తి ఒక్కసారిగా మోడ్రన్ డ్రెస్‌లో కనిపిస్తే కొందరు తీసుకోలేరు. అయితే డ్రెస్‌ను బట్టి గౌరవ, మర్యాదలు తగ్గడమో.. పెరగడమో జరిగితేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.
Bindu Madhavi : ఓ చిరాకు పెట్టించే కామెంట్ కనిపించింది..
బిగ్‌బాస్ ఓటీటీలో చక్కని ఆటతీరును కనబరచలేకపోయినప్పటికీ.. ఎదుటి వ్యక్తి ఎమోషన్స్‌తో అద్భుతంగా ఆటాడగలిగింది బిందుమాధవి. మొత్తానికి వారికి అసహనాన్ని తీవ్ర రూపంలో పెంచేసి.. మొత్తానికి ఎలాగోలా ప్రేక్షకులకు బాగా దగ్గరై పోయింది. దీంతో అమ్మడిని విన్నర్‌గా కూర్చోబెట్టారు ప్రేక్షకులు. అప్పటి నుంచి బిగ్‌బాస్‌తో వచ్చిన క్రేజ్‌ను కాపాడుకునేందుకు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు బాగా టచ్‌లో ఉంటూ వస్తోంది. ఈ సందర్భంగా అమ్మడికి ఓ చిరాకు పెట్టించే కామెంట్ కనిపించింది. సర్వసాధారణంగానే ఆ నెటిజన్‌కు ఇచ్చి పడేసింది. కొందరు స్టార్ హీరోయిన్స్ నెటిజన్ల కామెంట్స్‌కు చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఈ అమ్మడు మాత్రం కాసింత గట్టిగానే సమాధానం చెప్పింది.
బిందుమాధవిని బిగ్‌బాస్ రియాలిటీ షోలో చాలా హూందాగా.. చీరల్లో, చుడీదార్స్లో మాత్రమే ప్రేక్షకులు చూశారు. తాజాగా అమ్మడు కాస్త హాట్‌గా కనిపించేసరికి ఓ నెటిజన్ కాస్త ఇబ్బందిగా ఫీలైంది. ఈ విషయమే ఆమెకు చెప్పాడు. ‘బిగ్‌బాస్‌లో బింధుమాధవిని చూసినప్పుడు ఆమె అంటే నాకు గౌరవం ఉండేది. ఎందుకంటే ఇతర కంటెస్టెంట్స్ అందరూ తమ బాడీని ఎక్స్పోజ్ చేస్తుండేవారు. ఆమె మాత్రం చక్కగా డ్రెస్ వేసుకుంది. కానీ ఇప్పుడా ఆ గౌరవం పోయింది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసింది. ఆమెకు కాసింత స్ట్రాంగ్‌గానే బిందుమాధవి కౌంటర్ ఇచ్చింది. వ్యక్తి దుస్తుల కారణంగా వచ్చే గౌరవం తనకు వద్దని చెప్పేసింది. ఇక నెటిజన్స్ సర్వసాధారణంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరు సదరు నెటిజన్ పక్షాన.. మరొకరు బిందుమాధవి పక్షాన చేరిపోయారు.