Bipasa Basu : బాలీవుడ్ సెక్సీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది బిపాసా బసు. తన అందచందాలతో యూత్‌కు కిర్రెక్కించింది. అమ్మడు 2001లో వచ్చిన అజ్ నబీ సినిమాకు వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాకే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డును సొంతం చేసుకుంది. ఇక అక్కడ నుంచి వరుస సినిమాల్లో అవకాశాలు రావడంతో అమ్మడికి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా టైమ్ కూడా పట్టలేదు. బిపాసా హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ, ఇంగ్లీష్, తమిళ్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ‘టక్కరిదొంగ’ సినిమాలో మహేష్ పక్కన మెరిసింది. చాలా హిట్ సినిమాల్లో నటించి మంచి స్టార్ డమ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం అమ్మడు కరణ్ సింగ్ గ్రోవర్తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
43 ఏళ్ల ఈ సెక్సీ హీరోయిన్ తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. తాజాగా బిపాషా తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ‘‘ఒక కొత్త సమయం, ఒక కొత్త దశ, ఒక కొత్త కాంతి మన జీవితపు ప్రిజమ్‌కు మరొక ప్రత్యేకమైన నీడను జోడిస్తుంది. మేము ఈ జీవితాన్ని వ్యక్తిగతంగా ప్రారంభించాం. మేము ఒకరినొకరు కలుసుకున్నాం. అప్పటి నుంచి మేము ఇద్దరం ఏకమయ్యాం. ఇప్పుడు ఆ ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం. మా ప్రేమ మా బిడ్డ రూపంలో మమ్మల్ని చేరబోతోంది. మాతో చేరి మా ఆనందాన్ని మరింత పెంచబోతోంది’’ అంటూ బిపాసా ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఇక బిపాసా షేర్ చేసిన పిక్‌లో బేబి బంప్‌తో చాలా బోల్డ్‌గా ఆమె కనిపించగా.. బేబి బంప్‌ను ముద్దాడుతూ.. కరణ్ సింగ్ కనిపించారు.
Bipasa Basu : ప్రముఖ హీరో జాన్ అబ్రహంతో డేటింగ్
బిపాసా పోస్టు చూసిన నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. బిపాసా ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. 2015 ఎలోన్ సినిమా తర్వాత ఆమె సినిమాల్లో కనిపించలేదు కానీ అదే ఏడాది అంటే 2015 లోనే డర్ సబ్కో లగ్తా హై వెబ్ సిరీస్‌లో హోస్ట్‌గా కనిపించింది. ఆ తరువాత బిపాస బసు చివరగా 2020లో వచ్చిన డేంజరస్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. తొలుత ప్రముఖ హీరో జాన్ అబ్రహంతో కొన్నాళ్ల పాటు డేటింగ్ కొనసాగించిన ఈ ముద్దుగుమ్ము ఏమైందో ఏమో కానీ ఆయన నుంచి విడిపోయి.. ఆ తర్వాత కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.